newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు

06-04-202006-04-2020 08:30:21 IST
Updated On 06-04-2020 08:47:45 ISTUpdated On 06-04-20202020-04-06T03:00:21.955Z06-04-2020 2020-04-06T02:58:38.156Z - 2020-04-06T03:17:45.532Z - 06-04-2020

ప్రధాని మోడీ పిలుపుతో కదిలిన క్రీడాకారులు... దీపాల వెలుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కరోనా వైరస్ పై పోరాటానికి ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన లాక్ డౌన్ విజయవంతం అవుతోంది. దీనికి తోడు ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు జనమంతా దీపాలు వెలిగించారు. జాతి ఐక్యతను చాటారు. కరోనా చీకట్లను పారద్రోలడానికి మహా సంకల్పంతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, సినిమా పరిశ్రమతో పాటు అంతా ఏకమయ్యారు. క్రీడాకారులు దీపాలతో తమ మద్దతు తెలిపారు.

భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సహా భారత క్రీడాకారులు కలిసి ఆదివారం నాడు రాత్రి 9 గంట‌ల నుంచి, 9 నిమిషాల పాటు అని లైట్ల‌ను ఆర్పివేసి, దీపాలు, క్రొవ్వ‌ాత్తుల‌ను వెలిగించాల‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభ్యర్థనలో పాల్గొన్నారు. ఏప్రిల్ 3 న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ ఈ విషయాన్ని తెలియజేసారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఒక ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

"ఐక్యతతో చేసే ప్రార్థనలో తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరికోసం ప్రార్థించండి మరియు కలిసి నిలబడండి" అన్నారు. సచిన్ టెండూల్కర్ కూడా తన కుటుంబంతో ఒక ఫోటోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి పారిశుధ్య కార్మికులు నిస్వార్థ సేవ చేసినందుకు టెండూల్కర్ తన ట్వీట్‌లో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, వీరేందర్ సెహ్వాగ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, కె ఎల్ రాహుల్, హిమదాస్, మణిక బాత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మూడురోజుల క్రితమే ప్రధాని మోడీ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

కరోనాపై అవగాహన కల్పించడంలో క్రీడాకారులు క్రియాశీలక భూమిక నిర్వహించాలని ప్రధాని కోరారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సహా మొత్తం 49మంది క్రీడాకారులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు మోడీ . ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ ఐదు సూత్రాలను ఉపదేశించారు. కరోనాపై యుద్ధంలో ‘సంకల్స్(సంకల్పం), సన్యం(సమన్వయం), సంక్రమత(సానుకూలత), సమ్మాన్(ఐకమత్యం), సహయోగ్(సహాయం).. అనే సూత్రాలను పాటించాలని,  దేశ ప్రజల్లో ధైర్యాన్ని, సానుకూలతను నింపాలని క్రీడాకారులకు సూచించారు. కరోనాపై గెలిచేందుకు విరాట్ కోహ్లీ లాగా అందరం పోరాట స్ఫూర్తి కనబరచాలని ప్రధాని చెప్పారు. ఓపెనర్ రోహిత్శర్మ, మహమ్మద్ షమీ, పుజార, మాజీ ఆటగాళ్లు వీరేందర్ సెహ్వాగ్,  యువరాజ్, జహీర్ ఖాన్, దిగ్గజ స్ప్రింటన్ పీటీ ఉషా, యువ అథ్లెట్ హిమదాస్, రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వంటివారంతా ప్రధానికి మద్దతు పలికారు. ఆ స్ఫూర్తిని దీపాలు వెలిగించి చాటారు. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle