newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రణబ్ అస్తమయం.. శోకసంద్రంలో క్రీడాలోకం

01-09-202001-09-2020 09:27:26 IST
Updated On 01-09-2020 10:07:32 ISTUpdated On 01-09-20202020-09-01T03:57:26.814Z01-09-2020 2020-09-01T03:57:20.075Z - 2020-09-01T04:37:32.584Z - 01-09-2020

ప్రణబ్ అస్తమయం.. శోకసంద్రంలో క్రీడాలోకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిగా ఆయన అనేక కీలక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచారు. ఆయన ఆకస్మిక మరణానికి యావద్దేశం నివాళులర్పిస్తోంది. వివిధ రంగాలకు చెందిన వారితో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మక సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నానని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతితో తమకు అనుబంధాన్ని తెలియజేశారు ప్రముఖ క్రికెటర్లు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా సోమవారం ట్విట్టర్‌ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2020 కోసం యూఏఈలో ఉన్న కోహ్లి.. భారతదేశం అద్భుతమైన నాయకుడిని కోల్పోయిందని ట్వీట్‌ చేశాడు. ‘దేశం ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త విన్నందుకు బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ తెలియజేస్తూ కోహ్లీ ట్వీట్ చేశారు.

https://www.photojoiner.net/image/L9rsMQHL

ప్రణబ్ అస్తమయంతో ఒక శకం ముగిసిందంటూ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తన సంతాప సందేశంలో తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రణబ్ దిగ్గజ నేత అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని బాక్సర్  విజేందర్ సింగ్ గుర్తుచేసుకున్నారు. రచయితగా, ప్రజల మనిషిగా గుర్తింపుపొందిన ప్రణబ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.

మరో క్రికెటర్ రోహిత్‌శర్మ మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తపై తీవ్రంగా స్పందించారు. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘రెస్ట్ ఇన్ పీస్.. ప్రణబ్ ముఖర్జీ జీ. మీరు దేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ప్రియమైనవారికి నా సంతాపం’ అని స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ ట్వీట్‌ చేశాడు. ‘ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు హృదయపూర్వక సంతాపం. అతడి ఆత్మకు శాంతి కలుగుగాక.’ అని అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle