newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పొలిటికల్ ఎంట్రీ వైపు.. గంగూలీ చూపు!

25-08-202025-08-2020 14:35:32 IST
Updated On 28-08-2020 13:45:44 ISTUpdated On 28-08-20202020-08-25T09:05:32.056Z25-08-2020 2020-08-25T09:05:28.065Z - 2020-08-28T08:15:44.775Z - 28-08-2020

పొలిటికల్ ఎంట్రీ వైపు.. గంగూలీ చూపు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. అజహరుద్దీన్ ఎప్పుడో రాజకీయాల్లో చేరాడు. తాజాగా యూపీలో క్రికెటర్ చేతన్ చౌహాన్ బీజేపీలో చేరి కేబినెట్ మంత్రయ్యాడు. దురదృష్ణవశాత్తూ కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. తాజాగా మరో క్రికెటర్ బీజేపీలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో బీజేపీలో చేరనున్నారని అంటున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తుంది. గతంలో సరైన ప్రాతినిధ్యం లేని చోట ఇప్పుడు చెప్పుకోదగిన రీతిలో పార్టీని పటిష్టం చేశారు అప్పటి బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా. 

బీజేపీని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ప్రజాద‌ర‌ణ క‌లిగిన వ్యక్తుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో యూత్ లో మంచి క్రేజ్ వున్న సౌర‌వ్ గంగూలీని పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉంది.

అటు గంగూలీ కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం. త్వరలో ధోనీకి బీసీసీఐ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తోంది. రెండేళ్ళ క్రితం మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్ కత్తా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో స్కూల్ నిర్మించడానికి రెండెకరాల స్థలాన్ని గంగూలీకి ఇచ్చింది. అయితే రెండు రోజుల కింద గంగూలీ ఆ స్థలాన్ని తిరిగి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో గంగూలీ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధపడుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దీంతో గంగూలీ బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle