newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

పేస్ బౌలింగ్‌తో భయపెట్టకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిందే.. మైక్ అథర్టన్

27-06-202027-06-2020 07:57:02 IST
2020-06-27T02:27:02.062Z27-06-2020 2020-06-27T02:26:59.308Z - - 11-07-2020

పేస్ బౌలింగ్‌తో భయపెట్టకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిందే.. మైక్ అథర్టన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా పర్యటనకు సరైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ లేకుండా వెళితే భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ హెచ్చరిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్న టీమిండియా సిరీస్‌ను గెలవడం అంత ఈజీ కాదని అంటున్నాడు. ఇటీవల కాలంలో రాటుదేలిన టీమిండియా పేస్‌ బౌలింగ్‌.. ఆస్ట్రేలియాలో జూలు విదిల్చక తప్పదన్నాడు. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్‌తో ఆసీస్‌ను భయపెడితేనే సిరీస్‌లో పోరాడే అవకాశం ఉంటుందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే బలమైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టవద్దన్నాడు. సాధ్యమైనంతవరకూ పేస్‌ బౌలింగ్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. 

‘గత కొన్నేళ్లుగా భారత పేస్‌ బౌలింగ్‌లో వేగం పెరిగింది. భారత్‌లో చాలా మంది పేస్‌ బౌలర్లు పుట్టుకొస్తున్నారు. బలమైన పేస్‌ బౌలింగ్‌తో టీమిండియా పటిష్టంగా ఉంది. నేను చూసిన భారత జట్టుకు, ఇప్పటి భారత జట్టుకు చాలా తేడా ఉంది. నేను ఆడిన 1993 సమయంలో భారత్‌ స్పిన్‌పైనే ఆధారపడేది. అప్పుడు కూడా ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నా, ఇప్పుడు ఉన్నంత బలం లేదు. భారత్‌కు పేస్‌ బౌలింగ్‌ ఇప్పుడు అదనపు బలం. ఆసీస్‌ను పేస్‌ బౌలింగ్‌తో భయపడితేనే వారిపై పైచేయి సాధించవచ్చు. 

బ్యాటింగ్‌లో భారత్‌ బలాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్‌ శర్మ ఎర్రబంతితో కూడా బాగా రాణిస్తున్నాడు. అతనికి జతగా ఓపెనర్‌గా దిగే మయాంక్‌ అగర్వాల్‌ యావరేజ్‌ కూడా బాగుంది. విరాట్‌ కోహ్లి,  చతేశ్వర పుజారాలతో టాపార్డర్‌ బలంగా ఉంది. ఓవరాల్‌గా టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగానే ఉంది. కానీ పేస్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ పని పట్టకపోతే బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉన్నా అనవసరం’ అని అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు.  

2018-19 సీజన్‌లో ఆసీస్‌పై సాధించిన టెస్టు సిరీస్‌ విజయాన్ని టీమిండియా రిపీట్‌ చేయాలంటే పేస్‌ బౌలింగ్‌తో చెలరేగిపోవాలన్నాడు. ఆస్ట్రేలియాలో కూకాబుర్రా బంతులు ఉపయోగించడంతో అవి వెంటనే మెరుపును కోల్పోయి బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందన్నాడు.

టీమిండియాలో పుజారా టెర్రిఫిక్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో విజయం సాధించాలంటే టీమిండియా టాపార్డర్ మొత్తం జట్టు బ్యాటింగుకు వెన్నెముకలా ఉండాలి. కుకాబుర్రా బంతి సులభంగా తన మెరుగును పోగొట్టుకుంటుంది కాబట్టి దృఢమైన విజయవంతమైన ప్రారంభాన్ని భారత్ ఆటగాళ్లు అందించగలిగితే విజయంపై నమ్మకం పెట్టుకోవాచ్చని చెప్పాడు మైక్. టీమిండియాలో నంబర్ 3 పొజిషన్ మొత్తం గేమ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ప్రారంభాన్ని ఘనంగా మొదలెడితే మూడో నంబర్ బ్యాట్స్ మన్‌గా పూజారా పునాది వేస్తాడు. తర్వాత కోహ్లీ వస్తే భారత్ అనకూల స్థానంలో నిలబడుతుందని మైక్ చెప్పాడు.

అయితే బ్యాటింగ్ కంటే ఆస్ట్రేలియాలో భారత్ బౌలింగ్ అటాక్ మాత్రమే టీమిండియా విజయానికి బాటలేస్తుందని మైక్ అభిప్రాయపడ్డాడు. జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ నిలకడగా బౌలింగ్ వేయగలిగితే భారత్ విజయాన్ని శ్వాసించవచ్చని మైక్ తెలిపాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle