newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

05-07-202005-07-2020 16:30:46 IST
2020-07-05T11:00:46.989Z05-07-2020 2020-07-05T11:00:39.412Z - - 14-04-2021

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల అన్ని కార్యకలాపాలకు బ్రేక్ పడింది. క్రీడాభిమానులు క్రికెట్ పోటీల కోసం ఎదురుచూస్తున్న తరుణమిది. తాజాగా సుదీర్ఘ విరామం అనంతరం వెస్టిండీస్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. 

వెస్టిండీస్ తో జరగబోయే తొలి టెస్ట్ లో ఇంగ్లండ్  పేస్  బౌలింగే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఫస్ట్  టెస్ట్  కోసం ఇంగ్లండ్  అండ్  వేల్స్  క్రికెట్ బోర్డు(ఈసీబీ) జట్టును ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల తర్వాత జరగనున్న ఈ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లండ్  ఒకే ఒక్క స్పిన్నర్ తో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్  కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవడంతో బెన్ స్టోక్స్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

13 మందితో కూడిన జట్టులో వికెట్ కీపర్  బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో... ఆల్ రౌండర్ మొయీన్అలీకి అవకాశం దక్కలేదు. కరోనా నేపథ్యంలో తొమ్మిది మందిని రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్ట్  చేశారు. సామ్ కరన్కు రిజర్వ్  లిస్ట్ లో చోటు దక్కింది.

జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్  ఆండర్సన్, ఆర్చర్ , డామినిక్బెస్ , స్టువర్ట్ బ్రాడ్ , బర్న్స్, జోస్ బట్లర్ (కీపర్), జాక్ క్రావ్లే, జో డెన్లీ, ఒడెన్లీ లీ పోప్ , సిబ్లే, క్రిస్ వోక్స్ , మార్క్ వుడ్. రిజర్వ్  ప్లేయర్లు: జేమ్స్ బ్రాకే, సామ్కరన్, బెన్ఫోక్స్ , డాన్లారెన్స్, జాక్లీచ్, సకీబ్ మహమూద్ , క్రెయిగ్ ఓవర్టన్, ఒలీ రాబిన్‌‌సన్‌‌ , ఒలీస్టోన్.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle