newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పూర్తి స్థాయిలో ఐపీఎల్ 2020.. బీసీసీఐ కసరత్తు

24-07-202024-07-2020 09:39:57 IST
Updated On 24-07-2020 10:10:01 ISTUpdated On 24-07-20202020-07-24T04:09:57.191Z24-07-2020 2020-07-24T04:07:00.192Z - 2020-07-24T04:40:01.552Z - 24-07-2020

పూర్తి స్థాయిలో ఐపీఎల్ 2020.. బీసీసీఐ కసరత్తు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయడంతో.. ఐపీఎల్ 2020‌ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. భారత్‌‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. ఇప్పటికే యూఏఈ వేదికగా ఐపీఎల్‌ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. టోర్నీని కూడా 44 రోజుల నుంచి 51 రోజులకి పెంచింది. దాంతో.. షెడ్యూల్‌లో కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

వాస్తవానికి ఐపీఎల్‌ని తొలుత సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ అంటే.. 44 రోజులు 60 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ రూపొందించింది. కానీ.. డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్య దాదాపు పదికి చేరగా.. మరో వారం రోజులు టోర్నీని పొడిగించాలని బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్, ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. 

దీపావళి నేపథ్యంలో యాడ్స్ కోసం నవంబరు 15 వరకూ పొడిగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని రీతిలో వారం ముందే ఐపీఎల్.. అంటే సెప్టెంబరు 19 నుంచే ప్రారంభించాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2020 షెడ్యూల్‌పై తాజాగా పీటీఐతో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 51 రోజుల ఈ విండోలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. నవంబరు 8న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ షెడ్యూల్ బహుశా టోర్నీలోని ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్‌కి కూడా బాగా నచ్చుతుంది’’ అని వెల్లడించాడు.

ఐపీఎల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా టోర్నీ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle