పీసీబీ టార్గెట్....ఐపీఎల్ 2020 రద్దేనా?
06-07-202006-07-2020 14:17:11 IST
Updated On 06-07-2020 15:03:11 ISTUpdated On 06-07-20202020-07-06T08:47:11.085Z06-07-2020 2020-07-06T08:47:05.304Z - 2020-07-06T09:33:11.624Z - 06-07-2020

ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహకాలు ప్రారంభించబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తోంది. కానీ వాయిదాపై తుది నిర్ణయాన్ని మాత్రం గత రెండు నెలలుగా ఐసీసీ వాయిదా వేస్తూనే ఉంది. దాంతో టీ20 వరల్డ్‌కప్ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఆశిస్తున్న బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఐపీఎల్ 2020 సీజన్ ఒకవేళ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది. ఈ నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించాలనే పట్టుదలతో బీసీసీఐ ఉంది. కానీ ఒకవైపు ఐసీసీ నాన్చుడి ధోరణితో వ్యవహరిస్తుండగా.. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా సెప్టెంబరు- నవంబరు మధ్యలో ఆసియా కప్ 2020, పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. మొత్తంగా.. ఐసీసీ, పీసీబీ టార్గెట్ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను అడ్డుకోవడమే. భారత్‌లో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఐపీఎల్‌ని శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే ప్రాథమికంగా బీసీసీఐ నిర్ణయించింది. కానీ.. షెడ్యూల్‌పై మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోతోంది. పూర్తి స్థాయిలో టోర్నీని నిర్వహించాలంటే కనీసం 45 రోజుల విండో కావాలి. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు చివరి వారం నుంచి నవంబరు మొదటి వారం వరకూ ఉన్న విండోని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తదితర జట్లకి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా బీసీసీఐపైనే ఉంది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
3 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
7 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
15 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా