newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాత అలవాటు కోహ్లీని వెంటాడుతోంది.. వీవీఎస్ లక్ష్మణ్ వివరణ

01-03-202001-03-2020 16:42:03 IST
2020-03-01T11:12:03.202Z01-03-2020 2020-03-01T11:11:57.951Z - - 10-04-2021

పాత అలవాటు కోహ్లీని వెంటాడుతోంది.. వీవీఎస్ లక్ష్మణ్ వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్‌లో మూడు ఫార్మాట్ల సీరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణ వైఫల్యం జట్టు కూర్పునే ప్రశ్నార్థకం చేస్తోంది. తన కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా కోహ్లీ సగటు 9.50కి పడిపోవడం కోహ్లీ అభిమానులను కలవరపరుస్తోంది ఈ నేపథ్యంలో బ్యాట్‌ను బంతికి తాకించడంలో విరాట్ కోహ్లీ పాత అలవాటే తన తాజా వైఫల్యానికి కారణం అని భారతీయ దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.

రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వైఫల్యానికి ఎల్‌బీడబ్ల్యూ కారణం కానేకాదు. తను బ్యాట్‌ను కిందిగి దింపే తీరులోనే తేడా ఉంది. ఇంగ్లండుతో మ్యాచుల్లో కూడా కదులుతున్న బంతికి వ్యతిరేకంగా బ్యాట్ ఊపడంలో సమస్యవల్లే కోహ్లీ చాలాసార్లు అవుటవుతూ వచ్చాడు. ప్రత్యేకించి ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బంతులకు కోహ్లీ పదేపదే బలవుతూ వచ్చాడు. ఈ సీరీస్‌లో కూడా కోహ్లీ బ్యాట్ ఒక కోణంలా మరీ కిందిగి వంగుతోంది. అందుకే తన బ్యాట్‌కు, బంతికి మధ్య గ్యాప్ ఏర్పడి వికెట్ కోల్పోతున్నాడు. బౌలర్ చేతి నుంచి బంతి బయటపడ్డాక దాన్ని తాకేంత సమయాన్ని అతడు మిస్సవుతున్నాడు అని రెండోరోజు ఆట ముగిశాక స్టార్ స్టోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో లక్ష్మణ్ వివరించాడు. 

న్యూజిలాండ్‌తో టెస్టు సీరిస్‌లో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ పాత అలవాటే అతడిని వెంటాడింది అని వీవీఎస్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ప్లాన్ వేయడం దాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో న్యూజిలాండ్ అనుసరిస్తున్న వైఖరిని నిజంగా ఆ టీమ్‌ను అభినందించాలి. జట్టు ప్లాన్‌ను అమలు చేస్తున్నప్పుడు ఆటలోని అన్ని అంశాలను పక్కగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వికెట్ల ముందుకు బంతిని విసిరి అతడు ఆడటానికి అవకాశమివ్వకుండా పదే పదే దాడులు చేయడమే కోహ్లీ సులభంగా వికెట్ కోల్పోవడానికి కారణం అని వీవీఎస్ వివరించాడు.

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్స్‌మన్ పేలవ ప్రదర్సన కారణంగా టీమిండియా 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కోహ్లీ 14 పరుగులకే అవుట్ కాగా, పుజారా మాత్రమే 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి రిషబ్ పంత్, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. 3వ రోజు ఆటలో అద్భుతం జరిగినా సరే టీమిండియా ఓటమి నుంచి తప్పించుకనే అవకాశాలు ఏమాత్రం లేవన్నది స్పష్టం అవుతోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle