newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

20-02-202020-02-2020 14:49:03 IST
2020-02-20T09:19:03.282Z20-02-2020 2020-02-20T09:17:23.461Z - - 20-04-2021

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్తాన్ రాజకీయాల్లాగే క్రికెట్ బోర్డులోనూ ఎడతెగని ఉత్కంఠ వుంటుంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ ప్రకటన తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 

దీంతో ఉమర్ అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు..’’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.  ఓ ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ చర్యలు తీసుకుంది పీసీబీ. లాహార్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో అక్మల్ ఫెయిలయ్యాడు. దీంతో  అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. 

2019 ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ ఆడాడు. అయితే, ఆ సిరీస్‌లో అక్మల్‌ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు చేశారు. అక్మల్ చర్యలపై పాక్ ప్రధాన కోచ్‌ మిస్బావుల్‌ గుర్రుగా ఉన్నాడట. అక్మల్‌పై చర్యలు తీసుకోవడం వెనుక మిస్బా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పీఎస్ఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్న అక్మల్ కు ఈ విధంగా ఊహించని షాక్ కలిగింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle