పాక్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లండ్ టీం ఇదే
30-07-202030-07-2020 10:41:35 IST
Updated On 30-07-2020 13:46:26 ISTUpdated On 30-07-20202020-07-30T05:11:35.947Z30-07-2020 2020-07-30T05:11:15.183Z - 2020-07-30T08:16:26.688Z - 30-07-2020

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలు ఆలస్యం అవుతున్నాయి. ఐపీఎల్ సెప్టెంబర్ నుంచి యూఏఇలో ప్రారంభం కానుంది. మరోవైపు వివిధ టెస్ట్ మ్యాచ్ ల నిర్వహణకు ఐసీసీ రంగం సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్‌తో ఆగస్టు 5 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ 14 మందితో కూడిన జట్టుని తాజాగా ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ని 2-1తో ఇంగ్లాండ్ టీం చేజిక్కించుకుంది. అదే జట్టుని పాకిస్థాన్‌తో సిరీస్‌కి ఇంగ్లాండ్,వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కొనసాగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని ఈసీబీ నిర్వహించబోతోంది. ఇంగ్లాండ్ టీమ్: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జోప్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాక్ క్రావ్లీ, శామ్ కరణ్, ఓలీ పోప్, డొమ్ సిబ్లీ, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్ ఆగస్టు 5న మాంచెస్టర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 13 నుంచి సౌథాంప్టన్‌లో రెండో టెస్టు, అదే వేదికగా 21 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఈ రెండు వేదికల్లోనే సిరీస్‌ని ఈసీబీ నిర్వహిస్తోంది. కారణం.. సౌథాంప్టన్, మాంచెస్టర్ స్టేడియాలు హోటల్స్‌కి దగ్గరగా ఉండటమే. ఈ టెస్టు సిరీస్ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. మొత్తం 29 మందితో కూడిన పాక్ టీమ్ నెల రోజుల ముందే అక్కడికి చేరుకుంది.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
an hour ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
9 hours ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
19 hours ago

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా