newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాకిస్తాన్‌కు షాక్.. ఇంగ్లండ్ ముంగిట చిత్తుచిత్తు

09-08-202009-08-2020 11:56:24 IST
Updated On 09-08-2020 12:03:27 ISTUpdated On 09-08-20202020-08-09T06:26:24.787Z09-08-2020 2020-08-09T06:25:43.906Z - 2020-08-09T06:33:27.185Z - 09-08-2020

 పాకిస్తాన్‌కు షాక్.. ఇంగ్లండ్ ముంగిట చిత్తుచిత్తు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మాంచెస్టర్: కరోనా విరామం అనంతరం ఆడిన ఫస్ట్‌ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. అనిశ్చితికి మారుపేరైన ఆ జట్టు ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో విజయం ముంగిట బొక్కబోర్లాపడింది. గంటగంటకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరకు ఆతిథ్య జట్టే పైచేయి సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్పగా ఆడిన ఆ జట్టు అద్భుత విజయాన్నందుకుంది.

నాలుగో రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) అసమాన ఆటతీరుతో మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకెళ్లకుండా 3 వికెట్ల తేడాతో గెలిచింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 82.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌లో రూట్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉంది. యాసిర్‌ షాకు నాలుగు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. 137/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ చివరి బ్యాట్స్‌మెన్‌ వీలైనంత వేగంగా ఆడి కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు జత చేశారు.

యాసిర్‌ షా (33) బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. దింతో జట్టుకు 276 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్‌కు మూడు, వోక్స్‌.. స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. వోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

277 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు 117 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది... ఓపెనర్లు సిబ్లీ (36), బర్న్స్‌ (10)లతో పాటు కెప్టెన్‌ రూట్‌ (42), స్టార్‌ ప్లేయర్‌ స్టోక్స్‌ (9), యువ బ్యాట్స్‌మన్‌ పోప్‌ (7) వెనుదిరిగారు.పాకిస్తాన్‌ బౌలర్లు అటు పేస్, ఇటు స్పిన్‌తో చెలరేగారు. గెలుపు కోసం మరో 160 పరుగులు చేయాలి. ఈ స్థితిలో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమనిపించింది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle