newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పనిమనిషికి అంత్యక్రియలు.. గంభీర్ పెద్ద మనసు

24-04-202024-04-2020 18:21:34 IST
Updated On 24-04-2020 19:14:20 ISTUpdated On 24-04-20202020-04-24T12:51:34.605Z24-04-2020 2020-04-24T12:51:20.565Z - 2020-04-24T13:44:20.429Z - 24-04-2020

పనిమనిషికి అంత్యక్రియలు.. గంభీర్ పెద్ద మనసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గౌతం గంభీర్ మంచి క్రికెటరే కాదు.. మంచి మానవతా వాది అని మరోమారు రుజువైంది. ప్రస్తుతం ఎంపీగా వున్న గంభీర్ చేసిన పనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తూర్పు ఢిల్లీ ఎంపీగా వున్న గౌతమ్​ గంభీర్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన ఇంట్లో పని చేస్తున్న సహాయకురాలి అంత్య క్రియలను గంభీరే స్వయంగా నిర్వహించాడు. సరస్వతి పాత్ర ఆరేళ్ళనుంచి గంభీర్ ఇంట్లో పనిచేస్తోంది.

గంభీర్ ఇంటిని, పిల్లలను కంటికిరెప్పలా ఆమె కాపాడుతోంది. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.  ప్రస్తుతం లాక్​డౌన్ ఉన్న కారణంగా మృత దేహాన్ని ఒడిశాలోని అమె కుటుంబానికి పంపలేకపోయారు. అయితే గంభీర్ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా గంభీర్ ధృవీకరించాడు.

“ఆమె మా ఇంట పనిమనిషి కాదు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ నా కుటుంబ సభ్యురాలే. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యతగా భావించాను. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన” అని గంభీర్ ట్వీట్ చేశాడు.

గౌతమ్ గంభీర్​ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. 49ఏండ్ల సరస్వతి పాత్ర తీవ్రమైన రక్తపోటు కారణంగా కొన్ని రోజుల క్రితం శ్రీరామ్ గంగ దవాఖానాలో చేరారు. అనారోగ్యం తీవ్రమవడంతో ఈనెల 21వ తేదీన ఆమె కన్నుమూశారు. గంభీర్ అందరికీ ఆదర్శంగా నిలిచాడని అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి పనిచేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలని సహచర ఎంపీలు, స్థానికులు గంభీర్ ని తెగ మెచ్చుకుంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle