facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

‘పద్మశ్రీ’ తో మురిసిన హారిక

11-03-201911-03-2019 16:44:38 IST
2019-03-11T11:14:38.610Z11-03-2019 2019-03-11T11:14:17.965Z - - 18-03-2019

‘పద్మశ్రీ’ తో మురిసిన హారిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ప్రతిష్టాత్మక  పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరించింది. 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం 112 మంది విజేతల్లో ఈరోజు 56 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించారు. 2019 సంవత్సరానికిగాను 112 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించగా ఇవాళ 56 మందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పురస్కారాలను ప్రదానం చేశారు. 

ద్రోణవల్లి హారిక చిన్నతనం నుంచే చదరంగంలో మెలకువలు నేర్చుకుంది. ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చుకుని ఆసియా ఖండపు అండర్ -10. అండర్ -12  పోటీలలో మొదటి స్థానము సంపాదించింది. ముంబై‌లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది. హారిక మూడు ప్రపంచ యువ చదరంగం ఛాంపియన్ షిప్ సాధించింది. 2007లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారంతో గౌరవించింది. 2019లో పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle