newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

19-02-202019-02-2020 18:27:49 IST
Updated On 19-02-2020 18:55:49 ISTUpdated On 19-02-20202020-02-19T12:57:49.996Z19-02-2020 2020-02-19T12:57:47.743Z - 2020-02-19T13:25:49.518Z - 19-02-2020

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పదికి పడిపోయాడు. రాహుల్ మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన కొందరు ఆటగాళ్ళు అత్యుత్తమ ర్యాంకులు పొందారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ మెరుగైన ర్యాంకు కైవసం చేసుకున్నాడు. కోహ్లీ స్థానం మోర్గాన్ కి దక్కింది.

టీ20 ర్యాంకులను ఐసీసీ ఇటీవల ప్రకటించగా కోహ్లీకి షాక్ తగిలింది. టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ పై అద్భుత ప్రతిభ చాటుకున్న కెఎల్ రాహుల్ 224 పరుగులు చేశాడు. దీంతో 2వ స్థానం పదిలంగా ఉంది. కానీ కోహ్లీ మాత్రం 105 పరుగులకే పరిమితం అయ్యాడు. దీంతో ర్యాంకు పడిపోయింది. రోహిత్ శర్మ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. వీరందరి కంటే బాబర్ ఆజమ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తర్వాత రాహుల్, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ పొందారు. బౌలింగ్ లో ఆప్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మొదటి, రెండవ ర్యాంకులు పొందడం విశేషం. 

1 బాబర్ ఆజమ్ (పాక్) 879 పాయింట్లు

2 లోకేష్ రాహుల్ (ఇండియా) 823 పాయింట్లు

3 ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 810 పాయింట్లు

4 కోలిన్ మన్రో (న్యూజిలాండ్) 785 పాయింట్లు

5 గ్లెన్ మాక్స్ వెల్ (ఆస్ట్రేలియా) 766 పాయింట్లు

6 డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్) 718 పాయింట్లు

7 ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) 702 పాయింట్లు

8 హజ్రతుల్లా (ఆఫ్గనిస్తాన్) 692 పాయింట్లు

9 ఇయోన్ మోర్గాన్ (ఇంగ్లండ్) 687 పాయింట్లు

10 విరాట్ కోహ్లీ (ఇండియా) 673 పాయింట్లు 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle