newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పట్టు చిక్కింది.. వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఆధిక్యం

18-07-202018-07-2020 10:22:30 IST
Updated On 18-07-2020 10:51:45 ISTUpdated On 18-07-20202020-07-18T04:52:30.479Z18-07-2020 2020-07-18T04:52:25.512Z - 2020-07-18T05:21:45.704Z - 18-07-2020

పట్టు చిక్కింది.. వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఆధిక్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్‌కి పట్టు చిక్కింది. వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ 356 బంతుల్లో 176 పరుగులు, ఓపెనర్ డొమినిక్ సిబ్లే 372 బంతుల్లో 120 భారీ శతకాలు కొట్టారు.  

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌‌ని 469/9తో శుక్రవారం డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఆట ముగిసే సమయానికి 32/1తో నిలిచింది. క్రీజులో ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (6 బ్యాటింగ్), నైట్‌ వాచ్‌మన్ అల్జారీ జోసెఫ్ (14 బ్యాటింగ్: 18 బంతుల్లో ) ఉండగా.. ఆ జట్టు ఇంకా 437 పరుగులు తొలి ఇన్నింగ్స్ కంటే వెనకబడి ఉంది.

ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ 207/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సిబ్లే- బెన్‌స్టోక్స్ జోడీ నాలుగో వికెట్‌కి ఏకంగా 260 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. బెన్‌స్టోక్స్ సెంచరీ తర్వాత బ్యాట్ ఝళిపించగా.. సిబ్లే అతనికి మంచి సహకారం అందించాడు. 

అయితే.. జట్టు 341 వద్ద సిబ్లేని పెవిలియన్‌కి పంపిన విండీస్ టీమ్.. ఆ తర్వాత పోప్ (7), క్రిస్‌వోక్స్ (0), శామ్ కరన్ (17)లను కుదురుకోనివ్వలేదు. కానీ.. మధ్యలో జో రూట్ (40: 79 బంతుల్లో 4x4) కాస్త నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా.. 162 ఓవర్లకి ఇంగ్లాండ్ 469/9తో నిలిచిన దశలో జో రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు.

వాస్తవానికి ఇంగ్లాండ్ ఆఖరి వికెట్ పడిన తర్వాత లేదా 500 స్కోరుని అందుకున్న తర్వాత డిక్లేర్ చేస్తుందని అంతా ఊహించారు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన డామ్ బెస్ (31 నాటౌట్: 26 బంతుల్లో 3x4, 1x6) కూడా దూకుడుగా ఆడుతూ కనిపించాడు.

 కానీ.. శుక్రవారం చివరి సెషన్‌లో కొత్త బంతితో కాసేపు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌‌లను ఇబ్బందిపెట్టాలని భావించిన కెప్టెన్ జో రూట్.. ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. అతని అంచనా నిజమైంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లోనే ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (12: 34 బంతుల్లో 2x4) వికెట్‌‌ని ఇంగ్లాండ్ తీయగలిగింది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   6 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle