పంత్ సిక్సర్ల మోత.. వీడియో వైరల్
09-09-202009-09-2020 17:35:58 IST
Updated On 09-09-2020 17:38:10 ISTUpdated On 09-09-20202020-09-09T12:05:58.892Z09-09-2020 2020-09-09T12:05:53.951Z - 2020-09-09T12:08:10.025Z - 09-09-2020

గతేడాది చివరిలో గాయం కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయారు రిషబ్ పంత్. తన స్థానంలో వికెట్ కీపింగ్ బాద్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్.. అటు బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో అద్భుతంగా రాణించడంతో.. పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇక పంత్‌లో ఎంతో టాలెంట్ ఉందని ఇప్పటికే పలువురు ఆటగాళ్లతో పాటు మాజీలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. కాగా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. టీమ్ఇండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు పంత్. ఎంస్ ధోని వారసుడుగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. పంత్ వాటిని అందుకోలేకపోతున్నాడు. తనపై ఉన్న భారీ అంచనాల కారణంగానే పంత్ తరచూ విఫలం అవుతున్నాడని పలువురు మాజీలు అంటున్నారు. ఇక తనకు అచ్చొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్)లో మరోసారి చెలరేగి పోవాలని బావిస్తున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్లో పంత్ విధ్వంసాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో మ్యాచుల్లో ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ సీజన్లో సత్తా చాటి టీమ్ఇండియాలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని బావిస్తున్నాడు. ఇక ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల వర్షం కురిస్తున్నాడు పంత్. ఆ జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పంత్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి బంతిని లాంగాన్ సిక్స్ కొట్టిన పంత్.. రెండో బంతిని డీప్ ఫైన్‌లెగ్ మీదుగా సిక్స్ బాదేశాడు. ఇక మూడో బంతిని లాంగాఫ్ వైపు బౌండరీ దాటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఇక మరో 10 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఢిల్లీ జట్టులో పంత్ కీలక ఆటగాడు. ఆ జట్టు మెంటార్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అందుబాటులో లేనప్పటికి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఢిల్లీ ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. పంత్ కొట్టిన సిక్సర్లకు 1998లో కోకాకోలా కప్ ఫైనల్లో భాగంగా జింబాబ్వేపై భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వరుసగా కొట్టిన మూడు సిక్సర్లను ఒక అభిమాని జత చేశాడు.

పడిక్కల్, కోహ్లీ చితక్కొట్టుడు.. రాజస్థాన్ కుదేలు
4 hours ago

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
19 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
22-04-2021

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021
ఇంకా