newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పంజాబ్ జట్టు కొంపముంచిన అంపైర్ నిర్ణయం..!

21-09-202021-09-2020 15:41:42 IST
Updated On 21-09-2020 15:47:28 ISTUpdated On 21-09-20202020-09-21T10:11:42.498Z21-09-2020 2020-09-21T10:11:39.151Z - 2020-09-21T10:17:28.205Z - 21-09-2020

పంజాబ్ జట్టు కొంపముంచిన అంపైర్ నిర్ణయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ మొదలై కేవలం రెండు రోజులు మాత్రమే అవుతోంది. అప్పుడే ప్రేక్షకుల్లో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ రెండో మ్యాచ్ లోనే అంపైర్  ఘోర తప్పిదం ఓ జట్టును నిలువునా ముంచేసింది. సాధారణంగా ఐపీఎల్ లాంటి టోర్నీలో నెట్ రన్ రేట్ కారణంగా టోర్నీ నుండి నిష్క్రమించే అవకాశాలు ఉంటాయి. కానీ ఏకంగా రెండు పాయింట్లు అకారణంగా వెళ్ళిపోతే ఏ జట్టుకైనా బాధ ఉంటుంది. అలాంటిదే కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు చోటు చేసుకుంది. 

ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ అసలుసిసలు టీ20 మజాను అందించింది. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా సాగింది. సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు విజయాన్ని ఎగరేసుకుపోయింది. అంపైర్ తప్పిదం వలన మ్యాచ్ ను కోల్పోయిన జట్టుగా కింగ్స్ లెవెన్ పంజాబ్ నిలిచింది. ఒకానొక సమయంలో మ్యాచ్ ఢిల్లీ చేతిలో ఉండగా.. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ విధ్వంసంతో మ్యాచ్ పంజాబ్ చేతిలోకి వచ్చింది. ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. పంజాబ్ కు ఆదిలోనే షాక్ ల మీద షాక్ లు తగిలాయి. మయాంక్‌ అగర్వాల్‌ (89; 60 బంతుల్లో 7×4, 4×6) ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైంది.

అయితే రబాడ వేసిన 18.3వ బంతిని అగర్వాల్‌ ఆడి.. రెండు పరుగులు తీశారు. క్రిస్‌ జోర్డాన్‌ బ్యాటును క్రీజులో ఉంచలేదని లెగ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఒక పరుగు కోత విధించాడు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం అనగా కింగ్స్‌ 12 పరుగులే చేసింది. మ్యాచ్‌ టై అయింది.  కోత విధించిన పరుగూ కలుపుకుంటే పంజాబ్ విజయం సాధించినట్లే.. కానీ అలా జరగలేదు. సూపర్ వరకూ మ్యాచ్ వెళ్లడం వలన ఢిల్లీ విజయాన్ని అందుకుంది. ఏది ఏమైనా అంపైర్ చేసిన తప్పు పంజాబ్ ను ముంచేసింది. టోర్నమెంట్ లో అంపైర్ల నిర్ణయాలు ఇంకా ఎంత వివాదాస్పదమవుతాయో.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle