newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

పంజాబ్ చిత్తు... రాయల్ ఛాలెంజర్స్‌దే గెలుపు

14-04-201914-04-2019 08:25:38 IST
2019-04-14T02:55:38.423Z14-04-2019 2019-04-14T02:55:32.845Z - - 22-07-2019

పంజాబ్ చిత్తు... రాయల్ ఛాలెంజర్స్‌దే గెలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఐఎస్‌ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 174 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన  బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కోహ్లీ, పార్థీవ్‌లు కలిసి తొలి వికెట్‌కి 43 పరుగులు జోడించారు. ఈ దశలో పార్థీవ్(19)ని రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. తరువాత డివిలియర్స్ క్రీజులో ఉన్న కోహ్లీతో జత కలిశాడు. తొలి బంతి నుండే దూకుడుగా ఆడుతున్న ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 85 పరుగులు జోడించారు. 

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 27 బంతుల్లో 46 పరుగులు చేయవలిసిన దశలో కోహ్లీ(67) ఔట్ అయ్యాడు. 53 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసిన కోహ్లీని షమీ ఔట్ చేశాడు. డీవిలియర్స్‌తో కలిసిన స్టయినిస్ దూకుడుగా ఆడారు.ఈ దశలో డీవిలియర్స్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. షమీ వేసిన 19వ ఓవర్ లో స్టయినిస్ 1 ఫోరు, డీవిలియర్స్ 1 సిక్సర్ కొట్టి సమీకరణాన్ని 6 బంతుల్లో 6 పరుగులుగా మార్చారు. 20వ ఓవర్ వేసిన శామ్ కరన్ బౌలింగ్ లో మొదటి బంతికే ఫోరు కొట్టిన స్టయినిస్ రెండో బంతికి రెండు పరుగులు చేయడంతో బెంగళూరు ఐపీఎల్-12లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 19.2 ఓవర్లలోనే బెంగళూరు విజయాన్ని సాధించింది. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి డీవిలియర్స్, 16 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి స్టయినిస్ నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అశ్విన్ చెరో వికెట్ తీశారు. 

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్స్ లోకేష్ రాహుల్, క్రిస్ గేల్ అదిరిపోయే ఆరంభాన్నిఇచ్చారు. ఈ జోడి కేవలం 6.2 ఓవర్లలోనే 66 పరుగులు జోడించారు. ఈ దశలో భారీ షాట్ ఆడబోయిన రాహుల్(18) ఔట్ అయ్యాడు. ఆ తరువాత మయాంక్ అగర్వాల్(15) కూడా వెంటనే ఔట్ కావడంతో పంజాబ్ స్కోరు ముందుకు సాగలేదు. అడపాదడపా గేల్ భారీ షాట్స్ ఆడుతున్నా అతనికి సపోర్ట్ చేసే బాట్స్మెన్ లేక పంజాబ్ బ్యాటింగ్ విసుగు తెప్పించింది.

సర్ఫరాజ్ ఖాన్(15), శామ్ కరన్ (1) వికెట్స్ కోల్పోయిన పంజాబ్ 150 స్కోరును కూడా దాటదేమో అనిపించింది. ఈ క్రమంలో జూలు విదిలించిన గేల్ ఫోర్లు, సిక్సర్లతో గేర్ మార్చాడు. మందీప్ సింగ్(18) అండతో గేల్ వీర బాదుడు బాదాడు. 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ కొట్టి 90 పరుగులకు చేరిన గేల్ 20 ఓవర్ రెండో బంతికి సింగిల్, నాలుగో బంతికి ఫోరు, ఆరో బంతికి ఫోరు కొట్టి 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. 

ఒక పరుగుతో గేల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గేల్ కేవలం 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గేల్ దెబ్బకు బెంగళూరు బౌలర్ సిరాజ్ తన కోటా నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 2, మొయిన్ అలీ, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle