పంజాబ్‌లో రైనా కుటుంబంపై భయంకరమైన దాడి
02-09-202002-09-2020 06:59:53 IST
Updated On 02-09-2020 07:17:14 ISTUpdated On 02-09-20202020-09-02T01:29:53.735Z02-09-2020 2020-09-02T01:29:51.972Z - 2020-09-02T01:47:14.842Z - 02-09-2020

వ్యక్తిగత కారణాలతోనే యూఏఈ నుంచి వెనక్కి వచ్చినట్లు ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఎట్టకేలకు స్పష్టం చేశాడు తమ కుటుంబంలో చోటుచేసుకున్న తీవ్ర విషాదం గురించి ట్విటర్ వేదికగా మంగళవారం స్పందించాడు. పంజాబ్‌లో ఉన్న తన కుటుంబంపై జరిగిన దాడి ఇప్పటికీ తనకు షాక్ తెప్పిస్తూనే ఉందని, ఎవరు, ఎందుకు దాడి చేసి మా కుటుంబంలో ఇద్దరిని ఘోరంగా చంపేశారో లోతుగా దర్యాప్తు చేయించాలంటూ రైనా పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు. రైనా ఆకస్మికంగా భారత్ తిరిగి రావటానికి కారణం స్పస్ఠం కావటంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రైనాకు కష్టకాలంలో బాసటగా ఉంటానని మాటమార్చింది. పంజాబ్‌లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. మా అంకుల్‌ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టవశాత్తు గత రాత్రి నా కజిన్ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు. మా మేనత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందో మాకు ఇంతవరకు తెలియలేదు. ఎవరు ఈ దాడి చేశారో అర్థం కావడంలేదు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పంజాబ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. అత్యంత హేయమైన పాల్పడిన నేరస్తుల గురించి కనీస వివరాలు తెలుసుకునే అర్హత మాకు ఉందని భావిస్తున్నా. అలాంటి నేరగాళ్లు మరిన్ని నేరాలకు పాల్పడకుండా చూడాలి’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సురేశ్ రైనా విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన సీఎం అమరీందర్ సింగ్.. రైనా బంధువులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కేసును త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటనకు పాల్పడింది ‘కాలే కచ్చే గ్యాంగ్’ అని తెలినప్పటికీ సాధ్యమైన అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. గత నెల చివరలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్ట్ 29న నలుగురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైనాకు ఎప్పుడైనా అండగా ఉంటాం .. సీఎస్కే అధినేత శ్రీనివాసన్ ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యజమాని ఎన్. శ్రీనివాసన్ 24 గంటల్లోపే సాంత్వన వచనాలు పలికారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. రైనా మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాల్సిన సమయమిది. మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంది. కష్టకాలంలో ఇప్పుడు కూడా మేం అతని వెంటే ఉంటాం. నా వ్యాఖ్యల్లో రైనాను తప్పు పట్టలేదు’ అని శ్రీనివాసన్ స్పష్టతనిచ్చారు. మరోవైపు రైనా వెనక్కి రావడంలో ‘హోటల్ గది’కి మించిన మరో బలమైన కారణం ఏదైనా ఉండవచ్చని చెన్నై టీమ్ సంబంధిత వ్యక్తి ఒకరు వెల్లడించారు. ‘సీఎస్కే నిబంధనల ప్రకారం కెప్టెన్, కోచ్, మేనేజర్లకు హోటల్లో అత్యుత్తమ సౌకర్యాలు ఉన్న గది ఇస్తారు. రైనాకు కూడా ఇలాంటిది ఇచ్చారు. అందులో బాల్కనీ లేకపోవడమనేది మరో అంశం. అయితే ఈమాత్రం దానికే వెనక్కి వచ్చేస్తారా. కరోనా కేసుల భయమే కాకుండా మరో కారణం కూడా ఉండవచ్చు. ఇప్పటికైతే రైనా తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే’ అని ఆయన అభిప్రాయ పడ్డారు.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
5 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
7 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా