newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

న్యూ ఇయర్‌ను ప్రపంచ రికార్డుతో ప్రారంభించిన కోహ్లీ

09-01-202009-01-2020 08:11:52 IST
2020-01-09T02:41:52.339Z09-01-2020 2020-01-09T02:41:45.464Z - - 14-04-2021

న్యూ ఇయర్‌ను ప్రపంచ రికార్డుతో ప్రారంభించిన కోహ్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతూ టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ ఈ ఏడాదిని కూడా ప్రపంచ రికార్డుతో ప్రారంభించాడు. 'రన్నింగ్' మిషన్ విరాట్ కొహ్లీ శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రెండు రికార్డులను నెలకొల్పాడు. శ్రీలంకతో సిరీస్ కు ముందు టీ20లలో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మతో కలిసి విరాట్ సమంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ టీ20 సిరీస్ కు రోహిత్ విశ్రాంతి తీసుకోవడంతో గౌహతీలో జరిగిన తొలి మ్యాచ్ లో విరాట్ రికార్డు బద్దలు కొడతాడని అందరూ ఆశించారు. కానీ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో అందరి ద్రుష్టి ఇండోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌ పై నెలకొంది. ఈ మ్యాచ్ లో అదరగొట్టిన కోహ్లీ కేవలం 17 బంతుల్లో రెండు సిక్సులు, ఒక పోర్ సహాయంతో 30 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

విరాట్ రెండో టీ20లో చేసిన పరుగులతో కెప్టెన్ గా 1006 పరుగులు చేశాడు. మరోవైపు టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన రోహిత్ శర్మను కూడా వెనక్కునెట్టి 2663 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు.ఇక కొహ్లీ కేవలం 30 ఇన్నింగ్స్‌లలో వెయ్యిపరుగులు చేయగా.. డూఫ్లెసిస్ 31 ఇన్నింగ్స్‌లో ఈ మైలు రాయి అధిగమించాడు.

పూణే వేదికగా జరగనున్న మూడో టీ20లో కూడా భారీ స్కోరు సాధించాలని విరాట్ అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీలంకతో మూడో టీ20 జనవరి 10న జరగనుంది. ఈ టీ20 సిరీస్ పూర్తి కాగానే ఆస్ట్రేలియా జట్టు మన దేశంలో పర్యటించనుంది. మూడు వన్డేలు మాత్రమే ఆడేందుకు ఆసీస్ జట్టు మన దేశానికీ వస్తోంది. ఈ వన్డే సిరీస్ తరువాత టీమిండియా విదేశీ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ లో పర్యటించనుంది. జనవరి 24 నుండి ఈ సిరీస్ మొదలు కానుంది.       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle