newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

న్యూజిలాండ్‌కు తొలి విజయం.. వన్డేలో టీమిండియాకు షాక్

05-02-202005-02-2020 18:04:04 IST
2020-02-05T12:34:04.645Z05-02-2020 2020-02-05T12:34:02.823Z - - 14-04-2021

న్యూజిలాండ్‌కు తొలి విజయం.. వన్డేలో టీమిండియాకు షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కివీస్ గడ్డపై ఆ దేశానికి శుభారంభం కలిగింది. టీమిండియా వన్డేలలోనూ జోరు కొనసాగించాలని భావించినా కివీస్ ఆటగాళ్ళు బ్రేకులేశారు. తొలి వన్డేలో విజయం సాధించారు. హామిల్టన్ వేదికగా ప్రారంభం అవుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవగా టామ్ లాథమ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

భారత్ జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ లేని లోటు కనిపించింది. గాయంతో ఈ సిరీస్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ బాగా రాణించాడు. మంచి బ్యాటింగ్‌తో చివరివరకు నిలిచి జట్టును విజయతీరానికి చేర్చాడు. 

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విధించిన 348 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కివీస్‌ జట్టు మరో 11 బంతులు వుండగానే సాధించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్‌ శతకంతో చెలరేగగా, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌లు అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, శార్దూల్‌ ఠాకూర్‌ 1 వికెట్‌ తీశాడు. టీమిండియా బౌలర్లలో ఒక్క బుమ్రా కివీస్ ని కట్టడిచేశాడు. కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్థశతకాన్ని సాధించగా, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి అర్థశతకంతో రాణించాడు.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle