newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేడే... ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. బ్రిజేష్ పటేల్

06-09-202006-09-2020 07:08:24 IST
2020-09-06T01:38:24.737Z06-09-2020 2020-09-06T01:38:22.107Z - - 22-04-2021

నేడే... ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. బ్రిజేష్ పటేల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఐపీఎల్ షెడ్యూల్ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూలు నేడు (ఆదివారం) విడుదల కానుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ధ్రువీకరించారు. యునైట్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ నవంబరు 10వ తేదీ వరకు జరగనుంది. ప్రారంభ మ్యాచ్ శనివారం జరగనుండగా, పైనల్ మ్యాచ్ మాత్రం వారం మధ్య జరగనుండడం  విశేషం. 

యునైట్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐపీఎల్-13 నవంబరు 10వ తేదీ వరకు జరగనుంది. ప్రారంభ మ్యాచ్ శనివారం జరగనుండగా, పైనల్ మ్యాచ్ మాత్రం వారం మధ్య జరగనుండడం విశేషం. ఐపీఎల్ 13 ఏళ్ల చరిత్రలో ఫైనల్ మ్యాచ్ వీక్‌డేలో జరగడం ఇదే తొలిసారి. అలాగే, మ్యాచ్ వేళలు కూడా మారాయి. సాయంత్రం మ్యాచ్‌లు 8 గంటలకు బదులు 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో 10 మధ్యాహ్న మ్యాచ్‌లు కూడా ఉండడం గమనార్హం. 

నిజానికి ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 4 మధ్య జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా టోర్నీ వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఆరు నెలలపాటు వాయిదా పడిన ఐపీఎల్ ఎట్టలకేలకు దుబాయ్‌  వేదికగా జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2020 వాయిదా పడడంతో సెప్టెంబరు-నవంబరు విండో మాత్రమే ఖాళీగా ఉండడంతో ఆ సమయంలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది.  

ఐపీఎల్ జట్లన్నీ క్వారంటైన్‌ను పూర్తిచేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మాత్రం కరోనా వేధిస్తోంది. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్‌ సహా 13 మంది ఆటగాళ్లు కరోనా బారినపడడంతో మరో ఏడు రోజులపాటు వారు తమ హోటల్ రూములలో సెల్ఫ్ క్వారంటైన్‌లలో ఉండనున్నారు.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle