newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేడు ముంబైతో కోల్‌కత్తా ఢీ.. అందరి దృష్టి కమిన్స్‌పైనే

23-09-202023-09-2020 15:31:13 IST
2020-09-23T10:01:13.919Z23-09-2020 2020-09-23T10:00:41.375Z - - 22-04-2021

నేడు ముంబైతో కోల్‌కత్తా ఢీ.. అందరి దృష్టి కమిన్స్‌పైనే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. నేడు డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ పోరులో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని కోల్‌కత్తా బావిస్తోండగా.. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన ముంబై.. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది.

చెన్నైతో మ్యాచ్‌లో ఒక్క సౌరవ్‌ తివారి మినహా మిగతా బాట్స్‌మెన్లు అంతా విఫలమయ్యారు. ఈ సారి బ్యాట్స్‌మెన్లు అంతా సమిష్టిగా రాణించాలని.. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఫామ్‌లోకి రావాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకొంటోంది. తొలి మ్యాచ్‌లో కృనాల్ పాండ్య, రాహుల్‌ చాహర్‌లు భారీగా పరుగులు ఇచ్చారు. వీరితో పాటు డెత్‌ బౌలర్ల స్పెషలిస్టు జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం అంచనాలు అందుకోలేకపోయాడు. ఈ విషయమే ముంబైని కలవరపెడుతోంది. పాటిన్సన్‌ బదులు.. కౌల్టర్‌నైల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ట్రెంట్‌ బౌల్డ్‌కు నైల్‌ తోడు అయితే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు కష్టాలు తప్పవు.

ఇక తొలి మ్యాచ్‌ గెలిచి టోర్నీలో ఘనంగా బోణి కొట్టాలని కోల్‌కత్తా బావిస్తోంది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఇయాన్‌ మోర్గాన్‌, టామ్‌ బాంటన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు సునిల్‌ నరైన్‌, రసెల్‌, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక అందరి దృష్టి కమిన్స్‌పైనే ఉంది. ఈ ఏడాది వేలంగా కమిన్స్‌ను రూ.15.5కోట్లు పెట్టింది కొంది. దీంతో ఈ ఆసీస్‌ ఆటగాడు ఎలా రాణిస్తాడు అనే దానిపైనే అందరిలో ఆసక్తి ఉంది.

ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా.. ముంబై 19 సార్లు గెలుపొందింది. కోల్‌కత్తా 6 సార్లు మాత్రమే విజయం సాధించింది. కాగా.. ఇరు జట్ల మధ్య 2014లో ఇదే వేదిక మీద జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించడం అనేది ఆ జట్టు ఆటగాళ్లలో విశ్వాసం నింపేదే. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లోనూ టాస్‌ గెలిచిన జట్లు చేధనకే మొగ్గు చూపాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle