నేడు బెంగళూరుతో పంజాబ్ ఢీ.. అందరి దృష్టి వారిపైనే
24-09-202024-09-2020 14:58:45 IST
Updated On 24-09-2020 15:24:44 ISTUpdated On 24-09-20202020-09-24T09:28:45.537Z24-09-2020 2020-09-24T09:28:29.098Z - 2020-09-24T09:54:44.671Z - 24-09-2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నేడు మరో ఆసిక్తర పోరుకు రంగం సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా సాయంత్రం 7.30గంటలకు రాయల్ ఛాలెంజర్స్ ఆప్ బెంగళూరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో కోహ్లీ సేన మంచి ఊపు మీద ఉంది. మరోవైపు.. తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఢిల్లీ పై పంజాబ్ ఓడిపోయింది. కాగా.. అంపైర్ తప్పిదంతో మ్యాచ్ కోల్పోయామని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని బావిస్తోంది. తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయిన యంగ్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ పైనే అందరి దృష్టి ఉంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థశతకం బాదాడు. ఎలాంటి బెరుకు కనపర్చ లేదు. స్వేచ్ఛగా ఆడాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్‌లో దేవదత్ ఎలా ఆడబోతున్నాడనేది ఆసక్తి రేపుతోంది. డివిలియర్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరికి తోడు కెప్టెన్ కోహ్లీ కూడా రాణిస్తే ఆర్సీబీ తిరుగుఉండదు. తొలి మ్యాచ్‌లో ఓటమి దిశగా సాగుతున్న తరుణంలో యజ్వేంద్ర చాహల్ మాయాజాలం చేశాడు. కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డివిరిచాడు. నవ్‌దీప్ సైని సైతం చక్కగా రాణించాడు. బౌలింగ్ విభాగంలో ఉమేశ్‌యాదవ్ ఒక్కడే ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఆ ఒక్కడు లయలోకి వస్తే ఆ జట్టును అడ్డుకోవడం కష్టం. ఇక పంజాబ్‌ను బాగా కలవరపెట్టే అంశం బ్యాటింగ్. హేమాహేమీలు ఉన్నా వారంతా తొలి మ్యాచ్‌లో విఫలం అయ్యారు. ఒక్క మయాంక్ అగర్వాల్ పోరాడకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు మాక్స్ వెల్, పూరన్ కూడా బ్యాట్ ఝళిపిస్తే పంజాబ్‌కు తిరుగుండదు. మహ్మద్ షమీకి తోడుగా యువ స్పిన్నర్ రవిబిష్ణోయ్ తొలి మ్యాచ్‌లో రాణించగా.. కాట్రెల్ ఫర్వాలేదనిపించాడు. భీకర లైనప్ కలిగిన బెంగళూరు బ్యాట్స్మెన్లను ఎంత వరకు కట్టడి చేస్తారనే దానిపైనే పంజాబ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు ఐపీఎల్లో రెండు జట్లు 24 సార్లు తలపడగా.. చెరో 12 విజయాలు సాధించాయి. అయితే.. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో బెంగళూరు విజయం సాధించింది. ఇక 2014లో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
7 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
17 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
17 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా