newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేడు చెన్నైతో రాజస్థాన్‌ ఢీ

22-09-202022-09-2020 14:01:23 IST
2020-09-22T08:31:23.513Z22-09-2020 2020-09-22T08:31:21.372Z - - 22-04-2021

నేడు చెన్నైతో రాజస్థాన్‌ ఢీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌(ఐపీఎల్‌)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనుంది. చెన్నైకి ఇది రెండో మ్యాచ్‌ కాగా.. రాజస్థాన్‌కు ఇదే మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ముంబై గెలిచి ఉత్సాహంగా ఉన్న చెన్నై.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల సంఖ్యను పెంచుకోవాలని బావిస్తుండగా.. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని రాజస్థాన్‌ పట్టుదలగా ఉంది.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై త్వరగానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికి విజయం సాధించడం అనేది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. కీలక ఆటగాడు సురేష్‌ రైనా లేని లోటును మరో సీనియర్‌ ఆటగాడు అంబటి రాయుడు భర్తీ చేస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో అంబటి బ్యాటింగే అందుకు నిదర్శనం. తొలి మ్యాచ్‌లో విఫలమైన షేన్‌ వాట్సన్‌, మురళీ విజయ్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది చెన్నై మేనేజ్‌మెంట్‌.

కాగా.. ముంబైతో మ్యాచ్‌లో ధోని, కేదార్‌ జాదవ్‌కు పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇక వీరిద్దరు కూడా బ్యాట్‌ ఝళిపిస్తే చెన్నైకి తిరుగుండదు. చెన్నైకి బౌలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. దీపక్‌ చాహర్‌, ఎంగిడి, చావ్లా, జడేజా, సామ్‌ కరణ్‌లు అవసరమైన సందర్భాల్లో వికెట్లు తీస్తూ.. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్‌ సాధించకుండా చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన బ్రేవో ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చినా.. తుది జట్టులో అవకాశం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. ముంబైతో మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతోనే బరిలోకి దిగాలని ధోని బావిస్తున్నాడట.

ఇక రాజస్థాన్‌కి ఇదే తొలి మ్యాచ్‌. ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులోకి రావడం అనేది ఆజట్టుకు బలం. తలకు గాయం కావడంతో ఇటీవల ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు స్మిత్‌ దూరమయ్యాడు. తాజాగా కాంకషన్ టెస్ట్ క్లియర్ చేయడంతో చెన్నైతో మ్యాచ్‌ ఆడేందుకు స్మిత్‌కు మార్గం సుగమమైంది.

కాగా.. తొలి మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌ దూరం కానున్నాడు. అతడి క్వారంటైన్‌ వ్యవధి ఇంకా పూర్తి కాలేదు. మరో ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్‌.. లీగ్‌లో ఆడడంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు జట్టులో చేరతాడో లేదో యాజమాన్యానికే తెలియని పరిస్థితి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నఅతడు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరమైన విషయమే. గత కొన్ని సీజన్లకు రాజస్థాన్‌కు వెన్నుముకగా ఉన్న రహానే ఈ సారి డిల్లీ తరుపున ఆడుతున్నాడం కూడా రాజస్థాన్‌కులో దెబ్బగానే చెప్పవచ్చు. అయితే.. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు ఉతప్ప ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే. యువ ఆటగాడు సంజు శాంసన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, జోప్రా అర్చర్‌ లతో కూడిన రాజస్థాన్‌.. చెన్నైకి గట్టి పోటి ఇవ్వగలవు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle