newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నువ్వు చెబితేనే ధోనీ ఫినిషర్ అయ్యాడా చాపెల్.. హర్భజన్, యువీ ధ్వజం

15-05-202015-05-2020 15:32:17 IST
Updated On 15-05-2020 15:54:27 ISTUpdated On 15-05-20202020-05-15T10:02:17.768Z15-05-2020 2020-05-15T10:02:15.172Z - 2020-05-15T10:24:27.078Z - 15-05-2020

నువ్వు చెబితేనే ధోనీ ఫినిషర్ అయ్యాడా చాపెల్.. హర్భజన్, యువీ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్‌ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్‌ బ్యాట్స్‌మన్‌ అంటూ కీర్తించిన టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ వ్యాఖ్య బూమెరాంగ్‌లాగా ఎదురు తగులుతున్నాయి. గ్రౌండ్ షాట్లు మాత్రమే కొట్టాలని, ప్రతిబంతిని హిట్టింగ్ చేయవద్దని తాను ఆనాడు ధోనీకి ఇచ్చిన సలహానే మహేంద్ర సింగ్ ధోనీని గొప్ప ఫినిషర్‌గా చేసిందని చాపెల్ చేసిన వ్యాఖ్యపై ధోనీ సహచరులు మండిపడుతున్నారు. ఆఖరి పది ఓవర్లలో కూడా హిట్టింగ్ చేయవద్దని కోచ్ చాపెల్ అంటూ హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ ధ్వజమెత్తారు.

టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌తో మన క్రికెటర్ల విభేదాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ దగ్గర్నుంచీ ఇర్ఫాన్‌ పఠాన్‌ వరకూ అందర్నీ శాసించాలని ఉద్దేశంతో ఉండేవాడు చాపెల్‌. గంగూలీ గొడవ, ఆటగాళ్ల మధ్య విభేదాలు, జట్టులో గ్రూపులు ఏర్పాటుకు చాపెల్‌ కారణమయ్యాడనే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  2005, మే నెల నుంచి 2007 వరకూ టీమిండియా ప్రధాన కోచ్‌గా పని చేసిన చాపెల్‌ ఒక నియంత ధోరణిలో వ్యవహరించేవాడు. తన మాటే నెగ్గాలనే పట్టుదలతో మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే చాపెల్‌ తాజాగా చేసిన ఒక కామెంట్‌ ఇప్పుడు టీమిండియా వెటరన్‌లకు కోపం తెప్పించింది.

ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదగడానికి తానే కారణమని చెప్పుకున్న చాపెల్‌పై యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  2005లో జైపూర్‌ వేదికగా ధోని సాధించిన 183 పరుగులకు తానే కారణమని చాపెల్‌ చెప్పుకురావడం యువీ, భజ్జీల కోపానికి కారణమైంది. గ్రౌండ్‌లో ప్రతీ బంతిని హిట్‌ చేయమని చెప్పడానికి బదులు గ్రౌండ్‌ నాలుగు వైపులా ఆడమని తాను ఇచ్చిన  ధోనిని గొప్ప ఫినిషర్‌ను చేసిందని చాపెల్‌ పేర్కొనడాన్ని వీరు తప్పుబడుతున్నారు. 

‘ధోనిని గ్రౌండ్‌ షాట్లు ఆడమని చాపెల్‌ చెప్పాడట. అది మమ్మల్ని మమ్మల్ని గ్రౌండ్‌ అవతలికి విసిరేయడానికేనా. చాపెల్‌ చాలా రకాల గేమ్స్‌ ఆడాడు’ అని భజ్జీ విమర్శించాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను ఓవరాల్‌గా చూస్తే చాపెల్‌తో భాగమైన రోజులే అత్యంత చెత్త అని హర్భజన్‌ పేర్కొ‍న్నాడు. 

ఇక యువరాజ్‌ సింగ్‌ సైతం చాపెల్‌ చేసిన కామెంట్‌పై విరుచుకుపడ్డాడు. ‘నువ్వు ఏ రోజు బంతిని హిట్‌ చేయమని చెప్పిన దాఖలాలు లేవు. చివరి పది ఓవర్లలో కూడా హిట్టింగ్‌ చేయవద్దనే అన్నావ్‌.  ధోనితో పాటు నన్ను కూడా ఆఖరి పది ఓవర్లలో కేవలం గ్రౌండ్‌ షాట్లకే పరిమితం చేశావ్‌’ అని చాపెల్‌ కోచింగ్‌ తీరును ప‍్రశ్నించాడు. 

ధోని అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించిన తొలి నాళ్లలో భారత్‌ కోచ్‌గా చాపెల్ వ్యవహరించాడు. ఆనాటి విశేషాలను ‘ప్లేరైట్‌ ఫౌండేషన్‌’ నిర్వహించిన ఆన్‌లైన్‌ చాట్‌లో పంచుకున్న చాపెల్‌.. ధోనిని ఆకాశానికెత్తేశాడు. క్రికెట్‌ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్‌ బ్యాట్స్‌మన్‌ అంటూ కీర్తించాడు. 

ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వన్దే స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పుణెలో మ్యాచ్‌ జరగ్గా, ధోనిని హిట్టింగ్‌ చేయొద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు. కేవలం గ్రౌండ్‌ షాట్లు కొట్టమని చెప్పానని, అదే ధోనిని గొప్ప ఫినిషర్‌గా చేసిందన్నాడు. 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle