newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నీ సారధ్యంలో.. నీతో ఆడటం నాకెంతో అదృష్టం.. విరాట్

17-08-202017-08-2020 08:41:52 IST
2020-08-17T03:11:52.180Z17-08-2020 2020-08-17T03:11:48.642Z - - 10-04-2021

నీ సారధ్యంలో.. నీతో ఆడటం నాకెంతో అదృష్టం.. విరాట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రిటైర్‌మెంట్‌పై విరాట్‌ కోహ్లి స్పందించారు. ఆదివారం ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. రిటైర్మెంట్‌ కారణంగా జాతీయ జట్టు తరఫున ఇక ధోని బరిలోకి దిగే అవకాశం లేకపోయినా... ఎప్పటికీ తన మనసులో కెప్టెన్‌గా ధోనియే ఉంటాడని కోహ్లి ఆదివారం బీసీసీఐ ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. 

తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికిన క్రికెటర్‌ ఎమ్మెస్‌ ధోనిపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన గౌరవాన్ని చాటుకున్నాడు. ‘‘కొన్ని సార్లు మాటలు కరువవుతాయి. అలాంటి సందర్భమే ఇది. మనమిద్దరం మంచి స్నేహాన్ని పంచుకున్నాం. ఒకర్ని ఒకరం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే  మనిద్దరి దారులు ఒకటే కాబట్టి. నీ సారధ్యంలో.. అదీ నీతో ఆడటం నాకెంతో ఇష్టం. 

‘గతంలోనూ చెప్పేవాణ్ని... ఇప్పుడూ చెబుతున్నా... ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌వి. జీవితంలోని కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడూ అలాంటి సందర్భమే వచ్చింది. టీమ్‌ బస్‌లో ఎల్లప్పుడూ చివరి సీటులో కూర్చున్న ఏకైక వ్యక్తివి నువ్వే. మనద్దరి మధ్య స్నేహం, సమన్వయం ఎంతో ఉంది. ఎందుకంటే జట్టు విజయం కోసం ఇద్దరం ఒకే లక్ష్యంతో పోరాడేవాళ్లం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా... 39 ఏళ్ల ధోని వచ్చేనెల 19న యూఏఈలో మొదలయ్యే ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ముందుకు నడిపించనున్నాడు.

కాగా అగ్రశ్రేణి భారత ఆటగాడు రోహిత్ శర్మ మరో భావోద్వేగ ప్రకటనతో ధోనీపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భవిష్యత్తు అవసరాల కోసం జట్టును ఎలా నిర్మించాలో ధోనీకి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలీదని రోహిత్ వ్యాఖ్యానించాడు. 

‘భారత క్రికెట్లోనే అత్యంత ప్రభావంతమైన ఆటగాడు ధోని. ఆటలో బాటలో అతని మార్గదర్శనం మమ్మల్ని నడిపించింది. దూరదృష్టి గల ఈ నాయకుడికి భవిష్యత్‌ అవసరాల కోసం జట్టును ఎలా నిర్మించాలా బాగా తెలుసు. ఇంతటి మేటి క్రికెటర్‌తో బ్లూ జెర్సీలో కలిసి ఆడకపోయినా... యెల్లో జెర్సీలో ప్రత్యర్థిగా పోటీ పడే అవకాశముంది. కెప్టెన్‌... 19న ముంబై, చెన్నైల మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్‌ దగ్గర కలుద్దాం’

– రోహిత్‌ శర్మ 

కాగా, ఎంఎస్‌ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‌ 

‘ప్రతీ క్రికెటర్‌ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ అంటూ ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ చేసిన వ్యాఖ్య నెటిజన్లను, క్రికెట్ అభిమానులను కదిలిస్తోంది.

ధోనీకి ఐసీసీ శుభాకాంక్షలు

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభినందనలు తెలిపింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్నీ మాట్లాడుడూ అతని విజయవంతమైన కెరీర్‌ను కీర్తించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. 

‘ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఎమ్మెస్‌ ధోని ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో వాంఖడేలో సిక్సర్‌తో మెగా ఈవెంట్‌ను ముగించిన చిత్రం ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనస్సుల్లో చిరకాలం ముద్రించుకొనే ఉంటుంది. ఈ తరానికి అతనొక స్ఫూర్తి ప్రదాత. ధోని అద్భుతమైన కెరీర్‌కు ఐసీసీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని మను సాహ్నీ అన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle