newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నీ కెప్టెన్‌ని... నన్ను ఫూల్ చేయవద్దు.. షమీపై ధోనీ ఆగ్రహం

11-05-202011-05-2020 17:48:42 IST
Updated On 11-05-2020 17:52:13 ISTUpdated On 11-05-20202020-05-11T12:18:42.734Z11-05-2020 2020-05-11T12:18:41.028Z - 2020-05-11T12:22:13.200Z - 11-05-2020

నీ కెప్టెన్‌ని... నన్ను ఫూల్ చేయవద్దు.. షమీపై ధోనీ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మైదానంలో అడుగుపెట్టాక ఎంత ప్రశాంత చిత్తం కల ఆటగాడినైనా ఒత్తిడి లోబర్చుకునే ప్రమాదం ఉందని, తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితుల్లో ఎంత గొప్ప ఆడగాడికైనా భయం, ఆగ్రహం, టెన్షన్ వరుసగా కలుగుతుంటాయని ఈ మధ్యే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పడం తెలిసిందే. మిస్టర్ కూల్ అని అంతర్జాతీయ క్రికెట్‌లో తనకు ఎంతో పేరున్నా ధోనీ కూడా సహచరుల్నీ దారిలో పెట్టడానికి అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడని తాజా ఉదంతం చెబుతోంది.  కానీ ఇవేవీ మనకు లైవ్‌ మ్యాచ్‌ల్లో కనిపించవు. ఇవి చవిచూసిన ఆటగాళ్లు చెబితేతప్ప తెలియదు. 

సరిగ్గా ధోనీ నుంచి ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న పేసర్‌ మొహమ్మద్‌ షమీ దీన్ని ఇప్పుడీ లాక్‌డౌన్‌ సమయంలో తన బెంగాల్‌ రంజీ జట్టు సహచరుడు మనోజ్‌ తివారీతో పంచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ ఆగ్రహానికి ఎన్నడైనా గురయ్యావా అని బెంగాల్ టీమ్మేట్ మనోజ్ తివారీ తాజాగా మహ్మద్ షమీని ప్రశ్నించాడు. దానికి షమీ తన అనుభవాన్ని తివారీకి వివరంగా చెప్పాడు. 

2014లో న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో సరిగా సంధించని బంతిపై కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మహీకి కోపమొచ్చిందట. వెంటనే ‘దేఖ్‌ బేటా... బహుత్‌ లోగ్‌ ఆయే మేరే సామ్నే... బహుత్‌ లోగ్‌ ఖేల్‌కే చలే గయే. జూట్‌ మత్‌ బోల్‌. తుమారే సీనియర్, తుమారే కెప్టెన్‌ హై హమ్‌. యే బేవకూఫ్‌ కిసీ ఔర్‌కో బనానా’ (చూడు బిడ్డా... నేను ఎంతో మందిని చూశాను. నా కళ్ల ముందు ఆడి వెళ్లిన వారెందరో ఉన్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పకెప్పుడూ. నేను నీ సీనియర్ని. కెప్టెన్నీ కూడా... నన్ను పిచ్చోణ్ని చేయకు. వేరే వాళ్లెవరినైనా మభ్యపెట్టు) అని మందలించినట్లు అప్పటి సంఘటనని పేసర్‌ షమీ గుర్తు చేసుకున్నాడు. 

ఆ మ్యాచ్‌లో భారత్‌ మంచి స్థితిలో ఉన్నప్పటికీ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (302) ట్రిపుల్‌ సెంచరీతో గెలుపు దూరమైందని, నిజానికి 14 పరుగుల వద్ద కోహ్లి క్యాచ్‌ వదిలేయడంతో అతను సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆవిష్కరించాడని షమీ వివరించాడు. మళ్లీ మెకల్లమ్ 300 పరుగులకు చేరువైనప్పుడు కూడా తన బౌలింగులో మరో బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌‌ను కూడా వదిలేయడంతో అసహనానికి గురైన షమీ తర్వాత బంతి బౌన్సర్‌ వేశాడు. 

ఆ బౌన్సర్‌ను ధోని అందుకోలేకపోవడం... అదికాస్తా ధోనీ తలపై నుంచి చిక్కకుండా బౌండరీ దాటిపోవడం జరిగాయి. ఏమిటీ బౌలింగ్ అంటూ ధోని తర్వాత సంజాయిషీ కోరగా షమీ బంతి తన చేయిజారిపోయిందని సమర్థించుకుంటూ ఏదో చెప్పబోయాడు. దాంతో ‘మిస్టర్‌ కూల్‌’ తనకు ఘాటుగా బదులిచ్చాడని షమీ అప్పటి విషయాన్ని వివరించాడు.

అయితే భారత్‌కు రెండు సార్లు వరల్డ్ కప్ గెలిపించి ఇచ్చిన ధోనీని ప్రశంసించాడు షమీ. మహీ భాయ్ నేతృత్వంలోనే మూడు ఫార్మాట్లలో నేను ఆడగలిగాను. ధోనీ చెప్పేది వింటే చాలు మనం నేర్చుకుంటూనే ఉంటాం. అతడు అలాంటి గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి అంటూ షమీ కొనియాడాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle