newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్

14-08-202014-08-2020 09:33:09 IST
Updated On 14-08-2020 09:38:13 ISTUpdated On 14-08-20202020-08-14T04:03:09.584Z14-08-2020 2020-08-14T04:02:55.158Z - 2020-08-14T04:08:13.437Z - 14-08-2020

నా బౌలింగ్ దెబ్బకు కోహ్లీ, గంభీర్ షాక్... పాక్ పేసర్ ఇర్ఫాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు గౌతం గంభీర్‌ తన కళ్లలోకి చూడాలంటే భయపడేవాడని కొన్ని రోజుల క్రితం పేర్కొన్న పాకిస్తాన్‌ వెటరన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌.. తాజాగా తన బౌలింగ్‌ చూసి టీమిండియా కీలక బ్యాట్స్‌మన్  విరాట్‌ కోహ్లినే అప్పట్లో బిత్తరపోయాడన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం భారత పర్యటనలో భాగంగా కోహ్లి తన బౌలింగ్‌ను చూసి ఆశ్చర్యపోయాడన్నాడు. ఈ మేరకు ఆనాటి జ్ఞాపకాల్ని పాకిస్తాన్‌ బ్రాడ్‌కాస్టర్‌ సవేరా పాషాతో మహ్మద్‌ ఇర్ఫాన్‌ పంచుకున్నాడు. 

క్రిక్‌ కాస్ట్‌లో భాగంగా ఇర్పాన్ యూట్యూబ్‌ చాట్‌లో పలు విషయాల్ని తెలిపాడు. ఆ  భారత పర్యటనలో తాను పెద్ద పేసర్‌ను కాదని భారత ఆటగాళ్లు అంచనా వేశారని, కాకపోతే తన బౌలింగ్‌లో వేగం చూసి అంతా ఆశ్చర్యపోయారన్నాడు.

‘నేను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు నన్ను తక్కువగా అంచనా వేశారు. భారత కోచ్‌లు నా బౌలింగ్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. నేను 130-135 కి.మీ వేగంతో బౌలింగ్‌ వేస్తానని భారత ఆటగాళ్లకి చెప్పారట. ఈ విషయాన్ని భారత క్రికెటర్లే నాకు చెప్పారు. 

కాకపోతే కోహ్లి ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా బౌలింగ్‌ చూసి ఆశ్చర్యపోయాడట. నేను 145-146 కి.మీ వేగంతో బౌలింగ్‌ వేయడం చూసి అతని  పక్కనే ఉన్న కోచ్‌ను ప్రశ్నించాడట. ఇదే విషయాన్ని కోహ్లినే నాకు చెప్పాడు. ఇద్దరం ఎదురుపడినప్పుడు స్వయంగా కోహ్లినే నా బౌలింగ్‌ను ప్రశంసించాడు. నిన్ను మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అన్నారు. నువ్వేమో 150కి.మీ వేగంతో బౌలింగ్‌ వేస్తున్నావు అన్నాడు’ అని ఏడడుగుల ఒక అంగుళం ఎత్తు ఉండే మహ్మద్‌ ఇర్ఫాన్‌ తెలిపాడు.

2017లో పీసీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్‌.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఏడు అడుగులు పైగా ఉండే ఇర్ఫాన్‌.. 2012లో భారత పర్యటనకు వచ్చాడు. ఆ సిరీస్‌లో గౌతం గంభీర్‌ను నాలుగుసార్లు(వన్డేలు, టీ20లు) ఔట్‌ చేశాడు.

గౌతం గంభీర్ హడలిపోయాడు.. కెరీరే ముగిసింది.. ఇర్ఫాన్

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కెరీర్‌ తన వల్లే ముగిసిందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2012లో పాకిస్తాన్‌లో భారత పర్యటన సందర్భంగా గంభీర్‌ వైట్‌ బాల్‌ కెరీర్‌కు తానే తెరదించానని ఆయన ఇర్ఫాన్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గంభీర్‌ను టీమిండియా నుంచి తప్పించక మునుపు తాను అతడిని షార్ట్‌ బంతులు, బౌన్సర్లతో ఇబ్బందులు పెట్టానని చెప్పారు. ఈ టూర్‌లో ఇర్ఫాన్‌ రెండు సార్లు గంభీర్‌ను అవుట్‌ చేశాడు. గంభీర్‌ తన చివరి టీ20ని ఆ సిరీస్‌లోనే ఆడి ఆ తర్వాత టీ20లో ఎన్నడూ తిరిగి అడుగుపెట్టలేదు

ఇక గంభీర్‌ 2013 జనవరిలో ఇంగ్లండ్‌పై తన చివరి వన్డే ఆడాడు. కాగా పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ ప్రెజంటర్‌ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో​ ఇర్ఫాన్‌ గంభీర్‌పై చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. తన బౌన్సర్లను ఆడేందుకు గౌతం గంభీర్‌ చాలా ఇబ్బంది పడ్డాడని, తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోయాడని చెప్పాడు. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ల్లో బాగా ఆడేవారిని హీరోలుగా చూస్తే..ఆడని వారిని జీరోలుగా చూస్తారని అన్నాడు. 

తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో గంభీర్‌ తడబడ్డాడని, గంభీర్‌ సహజసిద్ధంగా ఆడలేకపోతున్నాడని ప్రతిఒక్కరూ అన్నారని క్రిక్‌ కాస్ట్‌ చాట్‌ షోలో ఇర్ఫాన్‌ వివరణ ఇచ్చారు. గంభీర్‌ పేలవ ప్రదర్శనతో అతడిని జట్టునుంచి తప్పించారని, ఆ తర్వాత ఆయన ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో కూడా సరైన సామర్ధ్యం కనబర్చలేదని, అందుకే తాను అలా వ్యాఖ్యానించానని చెప్పారు


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle