newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నా కెరీర్ అయిపోయిందనే అన్నారు.. ధోనీయే ఆదుకున్నాడు: షమీ

17-04-202017-04-2020 11:53:40 IST
Updated On 17-04-2020 11:56:31 ISTUpdated On 17-04-20202020-04-17T06:23:40.574Z17-04-2020 2020-04-17T06:23:37.577Z - 2020-04-17T06:26:31.357Z - 17-04-2020

నా కెరీర్ అయిపోయిందనే అన్నారు.. ధోనీయే ఆదుకున్నాడు: షమీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మద్దతు లేకపోయి ఉంటే తన కెరీర్ ఎప్పుడో ముగిసిపోయేదని టీమిండియా ప్రధాన ఫేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు. 2015 వన్డే ప్రపంచ కప్ మొత్తంగా గాయాలబారిన పడి పెయిన్ కిల్లర్స్‌తోనే బౌలింగ్ చేశానని, ఒకానొక కీలక మ్యాచ్‌లో నొప్పి భరించలేక ఫీల్డ్‌ను వదిలేసి వెళ్లిపోదామని అనుకుంటే మహేంద్రసింగ్ ధోనీ వారించి పూర్తి కోటా బౌలింగ్ వేయించాడని షమీ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను పడిన కష్టం మరెన్నడూ చూడలేదని, అంతా నా కెరీర్ అయిపోయిందని అనేశారని, కానీ ధోనీ ఆనాడు నాలో కలిగించిన ఆత్మవిశ్వాసం వల్లే ఈరోజుకీ జట్టులో కొనసాగుతున్నానని షమీ కృతజ్ఞత తెలిపాడు.

2015 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్ర్కమించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆనాటి సెమీ ఫైనల్లో భారత్‌ 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత ఆస్ట్రేలియా 328 పరుగులు చేస్తే, భారత జట్టు 233 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పటి మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీ మోకాలి గాయంతోనే బౌలింగ్‌ చేశాడట. ఒకానొక సమయంలో నొప్పి భరించలేక ఫీల్డ్‌ను వదిలేసి వెళ్లిపోదామని అనుకుంటే ధోని వారించడంతో పూర్తి కోటా బౌలింగ్‌ వేయగలిగానన్నాడు. ఆరేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఏం జరిగిందో ఇన్నేళ్ల తర్వాత షమీ పూసగుచ్చినట్లు చెప్పాడు. అదేమిటో తనమాటల్లోనే విందాం.

How MS Dhoni motivated injured Mohammed Shami to play 2015 ICC ...

‘ఆ వరల్డ్‌కప్‌లో కొన్నిసార్లు మాకు ముఖ్యమైన మ్యాచ్‌లు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌ నుంచి మోకాలి గాయం వేధించింది. కనీసం నడవానికి కూడా ఇబ్బంది పడేవాడ్ని. ఆ వరల్డ్‌కప్ అంతా పెయిన్‌కిల్లర్స్‌-ఇంజెక్షన్లతోనే బౌలింగ్‌ వేశా. మా ఫిజియో నితిన్‌ పటేల్‌ నాకు అండగా నిలిచారు. ఆ టోర్నమెంట్‌ ఆద్యంతం నాలో నమ్మకాన్ని నింపారు. నా మోకాలికి శస్త్ర చికిత్స జరిగితే గానీ తగ్గని నొప్పి అది. నా పిక్కలు- మోకాలు ఒకే సైజ్‌లో వాచిపోయాయి. అందుకోసం పెయిన్‌కిల్లర్స్‌ తీసుకుంటూనే టోర్నీ ఆడా. నా నొప్పిని తగ్గిస్తే నాకు ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో రెగ్యులర్‌గా పెయిన్‌కిల్లర్స్‌ వాడాల్సి వచ్చింది.

కానీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు నొప్పిని భరించలేకపోయా. ఆ సమయంలో మేనేజ్‌మెంట్‌-కెప్టెన్‌ ధోనిలు నాపై నమ్మకం ఉంచారు. దాంతో మ్యాచ్‌కు సిద్ధమయ్యా. నా తొలి స్పెల్‌లో 13 పరుగులే ఇచ్చా. ఇక రెండో స్పెల్‌ వేసే సమయానికి నొప్పి ఎ‍క్కువైంది. ధోని వద్దకు వెళ్లి నొప్పి భరించలేకపోతున్నానని చెప్పా. అప్పుడు నాలో ధోని ఆత్మవిశ్వాసాన్ని నింపే యత్నం చేశాడు. మొత్తం స్పెల్‌లో 60 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్తగా బౌలింగ్‌ వేస్తే చాలన్నాడు. ఈ సమయంలో పార్ట్‌ టైల్‌ బౌలర్లతో బౌలింగ్‌ చేయించడం కరెక్ట్ కాదని ధోని చెప్పాడు. దాంతో కడవరకూ ఫీల్డ్‌లో  ఉండి బౌలింగ్‌ చేశా. నాకు ధోని అండగా నిలవడంతో నా పూర్తి కోటా బౌలింగ్‌ వేయగలిగాను. అప్పుడు నేను చూసిన కష్టకాలం ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్‌ అయిపోయిందనే అన్నారు. కానీ ఈరోజుకీ జట్టులో కొనసాగుతున్నా’ అని షమీ పేర్కొన్నాడు.

సెమీ ఫైనల్ కాబట్టి మరో కొత్త బౌలర్ కోసం ప్రయత్నించలేమని ధోనీ చెప్పి నన్నే బౌలింగ్ వేయాలని ప్రోత్సహించాడు. ఇంజక్షన్ తీసుకుని తొలి  అయిదు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 13 పరుగులు ఇచ్చాను. తర్వాత నొప్పి భరించలేక ఇక నావల్ల కాదనేశాను. కానీ నీ మీద నాకు నమ్మకం ఉందని ధోనీ కొండంత విశ్వాసం కలిగించాడు. ఈ సమయంలో తాత్కాలిక బౌలర్‌ని తీసుకుంటే ఆసీస్ బాదిపడేస్తుందని ధోనీ వివరించాడు. నీ మొత్తం స్పెల్‌లో 60 పరుగులకు మించి ఇవ్వకపోతే చాలన్నాడు. అంత కఠిన పరిస్థితుల్లో నా జీవితంలో మరెన్నడూ ఆడి ఉండలేదు. నా కాలి ఎముకలోంచి నాలుగు మిల్లీమీటర్ల ముక్క పొడుచుకువచ్చింది. ఇక నీ పని ముగిసినట్లే అని చాలామంది చెప్పేశారు కూడా. కానీ ధోనీ, టీమ్ యాజమాన్యం భరోసా వల్లే నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాను అని షమీ చెప్పాడు,


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle