newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

నాలో కోపాన్ని తగ్గించింది ఆమె .. కోహ్లీ కృతజ్ఞత

23-04-202023-04-2020 09:59:42 IST
Updated On 23-04-2020 10:03:34 ISTUpdated On 23-04-20202020-04-23T04:29:42.229Z23-04-2020 2020-04-23T04:29:39.717Z - 2020-04-23T04:33:34.725Z - 23-04-2020

నాలో కోపాన్ని తగ్గించింది  ఆమె .. కోహ్లీ కృతజ్ఞత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుష్కశర్మను తొలిసారిగా కలిసిన తర్వాత జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నానని టీమిండియా కెప్టెన్, అనుష్క భర్త విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే నేనూ, అనుష్క మొదటిసారి కలిసినప్పటినుంచే నాలో సహనభావం పెరుగుతూ వచ్చిందనీ, అంతవరకు నేను దూకుడును ఏమాత్రం నిగ్రహించుకోలేకపోయేవాడినని కోహ్లీ అంగీకరించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో సొంత ఇంట్లో విరామ సమయాన్ని ఆనందంగా గడిపేస్తున్న కోహ్లీ, అనుష్క శర్మలు ఆన్ లైన్‌లో వివిధ వెబ్ సైట్లతో టచ్ లోకి వస్తూ యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 

తాజాగా కొంత‌మంది విద్యార్థులకు జీవితాన్ని ఎలా మ‌లుచుకోవాల‌నే దానిపై కోహ్లి దంప‌తులు ఆన్‌‌లైన్ సెష‌న్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిచ్చాడు. అనుష్క శ‌ర్మ నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని, ఒక‌వేళ ఆమె నా జీవితంలోకి రాక‌పోయుంటే వేరేలా ఉండేద‌ని  విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంప‌తులు చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నారు. ఎప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా గ‌డిపే ఈ ఇద్ద‌రు క‌రోనా పుణ్య‌మా అని ఆనందంగా గ‌డిపేస్తున్నారు. 

Anushka Sharma, Virat Kohli gaze into each other's eyes in ...

ఈ సంద‌ర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా ఓపిక విష‌యంలో క్రెడిట్ మొత్తం నా భార్య‌కే ద‌క్కుతుంది. గ‌తంలో తాను చాలా దూకుడుగా ఉండేవాడిని. నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో ప‌రిచ‌యం నాలో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో నేను ప్ర‌తీ చిన్న విష‌యానికి కొప్ప‌డేవాడిని. ఇప్పుడు ఆ ధోర‌ణి మారింది. అనుష్క శ‌ర్మ నాలో శాంతిని నింపింద‌నుకుంటా అని దాపరికం లేకుండా తన వ్యక్తిత్వంపై అనుష్క ప్రభావాన్ని విప్పి చెప్పాడు. 

కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ముందుగా అహాన్ని అదుపులో పెట్టుకోవాలి. కష్టకాలంలో ప్రశాంతంగా ఉండగలగాలి. ఆ తర్వాత మీ మార్గంలో ప్రతికూల పరిస్థితులపై పోరాటం చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక మార్గం దొరుకుతుంది. అందుకే అనుష్కను తొలిసారిగా చూసినప్పుడే ఈ పాఠం నేను నేర్చుకున్నాను అని కోహ్లీ చెప్పాడు.

పరిస్థితులు తనకు ఎదురు తిరుగుతున్నాయని భావించినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలను నాకు నేను వర్తింపజేసుకుంటాను. ఒక్కోసారి టెస్టు మ్యాచ్‌లో 20 పరుగులు తీయడం కోసం రెండు గంటలు బ్యాట్ పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ టీమ్ అలాగే ఆడాలని చెప్పినప్పుడు దానికి మనం కట్టుబడాల్సి ఉంది. అప్పుడే మీరు మీపై జట్టు పెట్టిన భారాన్ని మోయగలరు అని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు.

కెరీర్ ఆరంభించిన తొలినాళ్ల‌లో రాష్ట్ర జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో చాలా బాధ‌ప‌డ్డా.. డిల్లీ సెలెక్షన్ కమిటీ నా పేరు తిరస్కరించినప్పుడు ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు ప్రతి సారీ నేను బాగా ఆడుతూవచ్చాను. అన్నీ నాకు అనుకూలంగా జరుగుతూ వచ్చాయి. నా ఎంపిక ఖాయంగా అవుతుందనుకున్నాను కానీ చివర్లో నన్ను జట్టులోకి తీసుకోలేదు. అందుకే ఆరోజు రాత్రి 3 గంటల దాకా నిద్రపోలేదు. ఎందుకంటే నన్ను ఎంపిక చేయరు అని నేను నమ్మలేకపోవడమే ఆ బాధకు కారణం.. అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

ఒకరి నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవడం మనిషిని ఎంతో గొప్పగా మలుస్తుంది. ఆనుష్క వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినప్పుడు, విభిన్న పరిస్థితుల్లో ఆమె ఎలా స్థిరచిత్తంతో ఉండటాన్ని గమనించినప్పుడు నిజంగానే ఆమెలోని ఆ గుణాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఎదురీదేందుకు నన్నుకూడా పోరాడేలా మలిచాయి అని కోహ్లీ అనుష్క పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని ప్రదర్శించాడు.

కాగా 2013లో ఒక షాంపో యాడ్‌లో భాగంగా విరాట్‌, అనుష్క‌లు ఒకరొకొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. దాదాపు 4 ఏళ్ల బాంధవ్యం అనంత‌రం 2017లో పెళ్లి చేసుకున్నారు. 

అప్పుడు ఇమ్రాన్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ... పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ప్రశంసలు

కరాచీ విరాట్‌ కోహ్లీ నాయకత్వం లక్షణాలు చూస్తుంటే ఇమ్రాన్‌ ఖాన్‌ గుర్తుకొస్తున్నాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా అన్నాడు. 1992లో ఇమ్రాన్‌ సారథ్యంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో రమీజ్‌ సభ్యుడు. ‘ఇమ్రాన్‌ కెప్టెన్సీలో ఒక వైవిధ్యం ఉంది. పాక్‌ క్రికెట్‌కు స్వర్ణ యుగం లాంటి 90వ దశకంలో ఇమ్రాన్‌ నాయకత్వంలో మా జట్టు ఎంతో ఉన్నతంగా ఆడింది. అప్పట్లో ఇమ్రాన్‌లో కనిపించిన కసి, పట్టుదల ఇప్పుడు విరాట్‌లో చూస్తున్నా’ అని చెప్పాడు. 

‘భారత్‌కు ఎప్పుడూ మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంటుంది.  ఇక, గతంలో స్పిన్‌పై ఎక్కువ ఆధారపడేది. ఇప్పుడు పేస్‌ బౌలర్లు జట్టుకు బలంగా ఉన్నారు. కాబట్టి అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణిస్తోంది’ అని రమీజ్‌ తెలిపాడు. 

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

   2 hours ago


కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

   12-07-2020


ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

   11-07-2020


కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

   11-07-2020


ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

   11-07-2020


విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

   10-07-2020


గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

   10-07-2020


ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

   09-07-2020


ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

   09-07-2020


కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

   08-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle