newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

నాలాగా బ్యాటింగ్ చేస్తే వన్డేల్లో ఇప్పుడు మనుగడ కష్టమే.. ద్రావిడ్ ఒప్పుకోలు

11-06-202011-06-2020 17:54:24 IST
Updated On 11-06-2020 17:54:42 ISTUpdated On 11-06-20202020-06-11T12:24:24.022Z11-06-2020 2020-06-11T12:24:22.088Z - 2020-06-11T12:24:42.837Z - 11-06-2020

నాలాగా బ్యాటింగ్ చేస్తే వన్డేల్లో ఇప్పుడు మనుగడ కష్టమే.. ద్రావిడ్ ఒప్పుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుత క్రికెటర్ల ఆటతీరు చూస్తుంటే నాలాగా బ్యాటింగ్ చేస్తే ఇప్పుడు వన్డేల్లో ఎవరికైనా మనుగడ కష్టమేనని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఒప్పుకున్నారు. ప్రస్తుత తరానికి తన బ్యాటింగ్ శైలి అంతగా పనికిరాదని, అన్ని రకాల గేర్లలో బ్యాటింగ్ చేయగలగడం ప్రస్తుత క్రికెట్ తరానికి ఎంతో అవసరంమని అలాంటి నైపుణ్యం తనలో అయితే లేదని రాహుల్ నిజాయితీగా అంగీకరించారు. 

ఒక తరం వరకు గోడలాగే ప్రత్యర్థి బౌలర్ల బంతులకు అడ్డునిలిచి టీమిండియాకు పెట్టనికోటలా నిలిచిన రాహుల్ ద్రావిడ్ సహనంతో కూడిన బ్యాటింగ్‌కు ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఆటగాడని అందరికీ తెలుసు. సచిన్, సెహ్వాగ్ ధాటి ముందు ప్రాభవం కనుమరుగైనట్లు కనిపించిన ద్రావిడ్ ప్రస్తుత తరంలో రోహిత్, కోహ్లీలు భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు.

తరచి చూస్తే భారత్ మాజీ క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్‌కు ఎంతో గొప్ప పేరుంది. టెస్టు మ్యాచుల్లో అయితే ఇక ప్రత్యర్థుల సహనాన్ని పరిశీలించడంలో ద్రావిడ్ సాటి మరొకరు లేరు. అందుకే అభిమానులంతా ముద్దుగా అతడిని ‘ది వాల్’ అని పిలుచుకుంటారు. అయితే ప్రస్తుత ఆటగాళ్లతో ద్రావిడ్‌ను పోలిస్తే అతడి స్థానం ఎక్కడ ఉంటుంది.. ఈ ప్రశ్నకు రాహులే ఇటీవల సమాధానం చెప్పారు. ప్రస్తుత తరానికి తన బ్యాటింగ్‌ అంతగా పనికిరాదని చెప్పారు. 

Wouldn't have survived today if I batted the way I did", says ...

‘నా బ్యాటింగ్‌తో ఎక్కువకాలం నెట్టుకురాలేకపోయేవాడినేమో. ఇప్పుడు ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ చూడండి. అప్పట్లో సచిన్, సెహ్వాగ్‌ల స్ట్రైక్ రేట్ కంటే నాది తక్కువగా ఉండేది. కానీ అప్పట్లో అదే గొప్ప. కానీ ఇప్పుడలా కాదు. భారీగా ఆడగలగాలి. అన్ని రకాల గేర్లలో బ్యాటింగ్ చేయగలగాలి. నేను అలా చేయలేను’ అని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరంలో రోహిత్, కోహ్లీలు భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారని ద్రావిడ్ ప్రశంసించారు.

‘సుదీర్ఘ సమయం క్రీజులో ఉండి కొత్త బంతి మెరుపు కోల్పోయాక పరుగులు రాబట్టడమే నా శైలి. సెహ్వాగ్‌, సచిన్‌ ఆట దీనికి భిన్నంగా ఉంటుంది. అందుకే వన్డేల్లో ఈ ఇద్దరితో పోల్చితే నా సగటు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే నాలాంటి ఆటగాడు కొనసాగలేడు. కోహ్లీ, రోహిత్‌లతో నన్ను అసలే పోల్చుకోలేను. వీళ్లు వన్డేల తీరునే మార్చారు. అసలు నేను టెస్టు ఆటగాడినే కావాలనుకున్నా’ అని ద్రావిడ్‌ చెప్పాడు. 

ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్‌గా ఉన్న ద్రావిడ్ ఇప్పటి క్రికెట్లో డిఫెన్స్ ఆడటం బాగా తగ్గిపోయిందని, కానీ ఆత్మరక్షణాయుతంగా కాచుకుంటూ ఆడటం ఇప్పటికీ అవసరమేనని ద్రావిడ్ చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్ బంతిని చితకబాదటం కాకుండా అడ్డుకోవడం, కాచుకోవడం అనేది ఇప్పటికీ అవసరమేనని నా నమ్మకం. ఎందుకంటే మీరెంత చితకబాదినా ముందుగా చేయాల్సిన పని మీ వికెట్‌ను కాచుకోవడమే. అయితే వాస్తవానికి ఈరోజు క్రికెటర్‌గా జీవితం కొనసాగాలంటే, క్రికెట్‌ను జీవికగా చేసుకోవాలంటే టెస్ట్ క్రికెటర్‌ కావడం తప్పనిసరి కాదు. 

కానీ టీ-20 లేక వన్డేని మీ కెరీర్‌గా మల్చుకుంటే ఎలాంటి ఆత్మరక్షణాయుతమైన ఆటతీరు ప్రదర్శించకుండానే మీరు సులభంగా బతికేయవచ్చు అని రాహల్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో మనుగడ కోసం నేను ఆడిన సమయంలో టెస్ట్ క్రికెట్ తప్పనిసరి అవసరంగా ఉండేది. కానీ ఇప్పుడా అవసరం లేదు. టీ-20 పుంచుకోవడంతో ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఎంచుకునే వీలు దొరుకుతోందని చెప్పాడు.

ఒక తరం క్రితం మీరు కెరీర్ రూపొందించుకోవాలంటే టెస్ట్ క్రికెటర్‌గా మారాల్సి ఉండేది. ఇప్పుడు సైతం కోహ్లీ, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ వంటి వారు డిఫెన్సివ్ టెక్నిక్‌ను చాలా బాగా ఉపయోగిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లోని అత్యుత్తమ ఆటగాళ్లకు డిఫెన్స్ ఆడటం చాలా అవసరం. పైగా టెస్టు మ్యాచ్ అంటే అయిదు రోజుల పాటు కఛ్చితంగా ఆడాల్సిందే. ఆట మధ్యలోంచి వెళ్లిపోయేందుకు అవకాశమే ఉండదు. 

మన టీమ్ బ్యాటింగ్ చూడాలి. ప్రత్యర్థి బ్యాటింగును చూడాలి. మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలన్నిది ఆలోచించుకునే సమయం నీకు దొరకుతుంది. కానీ టెస్టు క్రికెట్‌లో ఉండే ఒత్తిడికి నేటి వన్డే, టీ-20 ఫార్మాట్లలో ఉండే ఒత్తిడి పూర్తి భిన్నంగా ఉంటాయి. వీటిని పోల్చలేం. నా వరకు చూస్తే టెస్టు క్రికెట్ అన్నదే అత్యంత కఠినమైనది అన్ని రాహుల్ వివరించాడు.

ఇదిలా ఉంటే రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో మొత్తంగా 24,000 పరుగులు చేశారు. అందులో 48 సెంచరీలు, 146 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ద్రావిడ్ స్ట్రైక్ రేట్ 42.51గా ఉండగా వన్‌డేల్లో మాత్రం 71.23తో మెరుగ్గా ఉన్నారు.

 

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

   an hour ago


కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

   12-07-2020


ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

   11-07-2020


కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

   11-07-2020


ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

   11-07-2020


విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

   10-07-2020


గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

   10-07-2020


ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

   09-07-2020


ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

   09-07-2020


కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

   08-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle