newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌‌కు యువీ నివాళి

30-04-202030-04-2020 10:18:47 IST
Updated On 30-04-2020 10:39:56 ISTUpdated On 30-04-20202020-04-30T04:48:47.099Z30-04-2020 2020-04-30T04:48:09.429Z - 2020-04-30T05:09:56.957Z - 30-04-2020

నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌‌కు యువీ నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బాలీవుడ్లో తక్కువ కాలంలోనే అందరినీ వదిలివెళ్లిపోయాడు నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఆయన మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడాడని, ఆ బాధ తనకు తెలుసునని యువీ అన్నాడు. ‘ఈ ప్రయాణం గురించి నాకు తెలుసు. నొప్పి గురించి తెలుసు. చివరి వరకు అతను పోరాడాడని నాకు తెలుసు. కొంతమంది అదృష్టం బాగుండి మనుగడ సాగిస్తారు. కొంత మంది ప్రయాణం ఎంతవరకు సాగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇర్ఫాన్‌ ఖాన్‌ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాల’ని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. 

యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. పట్టుదలతో ట్రీట్ మెంట్ తీసుకుని, తిరిగి కోలుకుని తిరిగి తనకిష్టమయిన క్రికెట్ క్రీడలో రాణించాడు. అతడికి క్యాన్సర్‌ సోకినట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో బయటపడింది. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన యువీ.. టీమిండియాను 28 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కించుకుని అందరి మన్ననలు పొందాడు.  

వన్డేల్లో మూడు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులను పొందిన అతి తక్కువ మందిలో యువరాజ్ ఒకడు. భారత క్రికెట్లో ఫీల్డింగ్ బాగా చేసే వారిలో యువి ఒకరని అంటారు. ఎలాంటి మైదానమయినా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ లలో అలవోకగా బ్యాట్టింగ్ చేయగల బ్యాట్సమెన్ లలో ఒకడిగా పేరు గడించాడు. యువీ సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు. యువరాజ్ సింగ్ 2019 సంవత్సరం జూన్ 10 తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle