newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీ వికెట్ల వెనక ఉంటే ఇక కోచ్‌తో పని ఏముంటుంది.. కుల్దీప్ యాదవ్

01-08-202001-08-2020 09:26:43 IST
Updated On 01-08-2020 09:28:31 ISTUpdated On 01-08-20202020-08-01T03:56:43.437Z01-08-2020 2020-08-01T03:56:40.152Z - 2020-08-01T03:58:31.864Z - 01-08-2020

ధోనీ వికెట్ల వెనక ఉంటే ఇక కోచ్‌తో పని ఏముంటుంది.. కుల్దీప్ యాదవ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అటు కెప్టెన్‌గా, ఇటు వికెట్ కీపర్‌గా, మ్యాచ్ ఫినిషర్‌గా అద్వితీయమైన చరిత్రను సొంతం చేసుకున్న మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ ఆటకు సబంధించినంతవరకు సంపూర్ణమైన మెలకువతో ఉండేవాడు. ఫీల్డ్‌ను సెటప్ చేసేవాడు, బౌలింగ్‌లో మార్పులు చేసేవాడు. ఆట కూర్పుపై వ్యూహ రచన చేసేవాడు. 

ఇన్ని పనులు చేస్తూనే వికెట్ల వెనకాల ఉండి బౌలర్ సంధించే ప్రతి బంతిని డేగలా పసికట్టేవాడు. ధోనీ ఇన్ని పనులు ఇంత సమర్థవంతంగా ఎలా చక్కబెట్టేవాడో ప్రత్యర్థులకు కూడా అంతు చిక్కేది కాదు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమై కేప్టెన్లలో ఒకడిగానే కాకుండా, గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా పేరు పొందాడు.

అందుకే టీమిండియాలోని ప్రతి బౌలర్ కూడా ధోనీ కెప్టెన్ గానూ, వికెట్ కీపర్ గానూ తమకు అందించిన సహకారం వెలకట్టలేదని ప్రతి సందర్బంలోనూ చెబుతూ వస్తున్నారు. ఈకోవలో తాజాగా కుల్దీప్ యాదవ్ కూడా చేరిపోయాడు.

స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్పిన్ కోచ్ లేని లోటును టీమెండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తీర్చేవాడని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ధోనిని ప్రశంసల్లో ముంచెత్తాడు. బౌలింగ్ స‌మ‌యాల్లో నాతో పాటు స‌హ‌చ‌ర స్పిన్న‌ర్ య‌జువేంద్ర చ‌హ‌ల్‌కు ఎన్నో‌సార్లు విలువైన స‌ల‌హాలిచ్చేవాడని కుల్దీప్ చెప్పాడు.

నిజం చెబుతున్నా.. ధోనీ నా ఎదురుగా ఉంటే నాకు కోచ్ లేడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతా. మ్యాచ్ ఆసాంతం ఓ కోచ్ ఎలాంటి సలహాలు, సూచనలు అయితే ఆటగాళ్లకు ఇస్తాడో, అవన్నీ ధోనీ నాకు ఇచ్చేవాడు. ప్రతి విషయంలో నాకు అండగా ఉండేవాడు. ముఖ్యంగా ఎక్కువగా బంతిని గింగిరాలు తిప్పడంపైనే దృష్టి సారించమని ధోనీ సూచించేవాడు. 

అతడు వికెట్ల వెనక ఉన్నాడంటే చాలు ఒత్తిడి మొత్తం పోతుంది. అంతేకాకుండా ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో నాకు సూచనలిచ్చేవాడని, కొన్నిసార్లు ధోనీయే మొత్తం ఫీల్డర్లను సెట్ చేసి ఏ బంతి వేయాలో కూడా ముందుగానే చెప్పేవాడు. ప్ర‌స్తుత కెప్టెన్ కోహ్లి కూడా ఇలాగే చేస్తున్నా.. ధోని కూడా మాతో ఉంటే బాగుండు అని అప్పుడ‌ప్పుడు అనిపిస్తుంటుంది అని కుల్దీప్ చెప్పాడు.

నేను టెస్టుల్లో అరంగేట్రం చేయ‌డానికి ఒక్క‌రోజు ముందు దిగ్గ‌జ లెజెండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. రాబోయే మ్యాచ్‌లో 5 వికెట్లు తీయాల‌ని నాతో అన్నాడు. నాకు అర్థంకాక కొద్దిసేపు అలాగే నిల‌బడిపోయాను. త‌ర్వాత క‌చ్చితంగా 5 వికెట్లు తీస్తాన‌ని చెప్పాను.' అంటూ కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

ముంబై  ఎంఎస్ ధోని గురించి ఎన్నిసార్లు చ‌ర్చించుకున్నా ప్ర‌తీసారి ఏదో ఒక కొత్త విష‌యం తెలుస్తుంటుంది. కెప్టెన్‌గా ధోని ఎంత స‌క్స్‌స్ అయ్యాడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు. బౌలింగ్ స‌మ‌యంలో వికెట్ల వెనుకాల నిల‌బ‌డి బౌలింగ్ టీమ్‌కు విలువైన సూచ‌నలు చేస్తూ ఎన్నో మ్య‌ాచ్‌లు గెలిపించాడు. 

 

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   an hour ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   5 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   21 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle