newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీ బాటలోనే రైనా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై

15-08-202015-08-2020 21:16:47 IST
Updated On 15-08-2020 22:11:41 ISTUpdated On 15-08-20202020-08-15T15:46:47.223Z15-08-2020 2020-08-15T15:46:37.663Z - 2020-08-15T16:41:41.410Z - 15-08-2020

ధోనీ బాటలోనే రైనా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే మరో సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌నకి శనివారం హాజరైన సురేశ్ రైనా.. చివరిగా 2018లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. 

After MS Dhoni, Suresh Raina Announces Retirement From ...

ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగిన సురేశ్ రైనా.. విరాట్ కోహ్లీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత జట్టుకి క్రమంగా దూరమైపోయాడు.2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌ పేరొందిన సురేశ్ రైనా.. 2020 టీ20 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశించాడు. 

కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదాపడిపోయింది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని ఇటీవల ధీమా వ్యక్తం చేసిన రైనా.. తన కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అదే బాటలో పయనించాడు. ధోనీకి రైనా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంతలా అంటే..? ధోనీ కూతురు జీవా పుట్టిన విషయాన్ని సాక్షి తొలుత చెప్పింది రైనాకి ధోనీతో చెప్పమంది. అంటే వీరి స్నేహం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని, రైనా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రకంపనలు కలిగిస్తోంది.  ఒకేసారి వీడ్కోలు పలికారు స్నేహితులిద్దరూ. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle