newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీ నిర్ణయం వెనుక ఏం జరిగింది?

15-08-202015-08-2020 21:13:39 IST
Updated On 15-08-2020 22:08:02 ISTUpdated On 15-08-20202020-08-15T15:43:39.983Z15-08-2020 2020-08-15T15:42:58.517Z - 2020-08-15T16:38:02.541Z - 15-08-2020

ధోనీ నిర్ణయం వెనుక ఏం జరిగింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అతను ఏ షాట్ కొట్టినా హిట్టే. అతను క్రీజులో వుంటే ప్రత్యర్ధులకు చెమటలు పట్టడం ఖాయం. అతనే జార్ఖండ్ యువకిశోరం మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియా క్రికెట్ కు కొత్త దశను, దిశను చూపించినవాళ్లలో ధోనీ అగ్రగణ్యుడు… ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ధోనీ ఒక సంచలనం. టీమీండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు. హఠాత్తుగా వెలువడిన ఈ నిర్ణయం ఎవరూ ఊహించలేదు. ధోని అంటేనే మ్యాచ్ విన్నర్. భారత జట్టులో మంచి మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోని..ఇటీవల కాలంలో మాత్రం వెనుకబడ్డాడనే చెప్పాలి. ఒకవైపు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస విజయాలతో దూసుకుపోతుంటే, ధోని నేతృత్వంలోని భారత పరిమిత ఓవర్ల జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంలో విఫలమైంది.

2016లో 13వన్డేలు ఆడగా, ఏడింట మాత్రమే భారత్ విజయం సాధించింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను భారత్ 1-4 తేడాతో కోల్పోయింది.  గత నెలలో పుట్టినరోజు నాడే ధోనీ కీలక నిర్ణయాలకు నాంది పలికాడు. ఇక నుంచి తాను పెద్ద పెద్ద డీల్స్ జోలికి పోనని, అలాంటి వాటికి తాను దూరంగా ఉంటానని తెలిపాడు. ఇక నుంచి ఎలాంటి డీల్సూ కుదుర్చుకోనని స్పష్టం చేశాడు. దీంతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి సేంద్రీయ వ్యవసాయానికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ లా మారాలనుకుంటున్నాడు. అందులో భాగంగా తానే ఓ బ్రాండ్ క్రియేట్ చేసి.. దాన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తానన్నాడు. 

లాక్ డౌన్ వల్ల ధోనీలో కీలకమయిన మార్పులు వచ్చాయి. మార్చిలో మొదటిసారి దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ధోనీ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న తన 50 ఎకరాల  ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి తిరిగాడు. దాదాపు మూడు నెలల పాటు ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేశాడు. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్ కొని వ్యవసాయ పనులు మొదలు పెట్టాడు. అది కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. సేంద్రీయ వ్యవసాయానికి తాను బ్రాండ్ కావాలని భావించాడు. అందుకు నియో గ్లోబల్ పేరుతో ధోనీ పండించే ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. ఏది ఏమైనా ధోనీ లేని భారత జట్టుని ఊహించడం కష్టం. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle