newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ధోనీ గొప్పతనం ఆ క్షణంలోనే బాగా అర్థమైంది.. కోహ్లీ

31-07-202031-07-2020 09:25:11 IST
2020-07-31T03:55:11.637Z31-07-2020 2020-07-31T03:55:04.877Z - - 07-08-2020

ధోనీ గొప్పతనం ఆ క్షణంలోనే బాగా అర్థమైంది.. కోహ్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలాగా మైదానంలో వికెట్ కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా ఫోక‌స్ పెట్ట‌డం మామూలు కష్టం కాదని తనకు స్వయంగా బోధపడిందని ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఒక‌వైపు కెప్టెన్‌గా ప‌నిచేస్తూనే మరొక‌వైపు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డమ‌నేది ఎంత క‌ష్టంగా ఉంటుందో తాను స్వ‌యంగా చూశానంటూ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. 

వివరాల్లోకి వెళితే 2015లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఒక వ‌న్డే మ్యాచ్‌లో  అప్ప‌టి కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానంలో కోహ్లి ఒక ఓవ‌ర్ పాటు వికెట్ కీప‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో ఫీల్డింగ్ కూడా సెట్ చేశాడు. అయితే వికెట్ కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా ఫోక‌స్ పెట్ట‌డం ఎంత క‌ష్ట‌మో అప్పుడు తెలిసొచ్చిందంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. 

మ‌యాంక్ అగర్వాల్ నిర్వ‌హిస్తున్న ఓపెన్ నెట్స్ విత్ మ‌యాంక్ చాట్‌షోలో పాల్గొన్న కోహ్లి ఆరోజు మ్యాచ్‌లో జ‌రిగిన  ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. 

Virat Kohli said to Mayank Agarwal, Abe, you have called for your ...

'బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న వ‌న్డేలో 44వ‌ ఓవ‌ర్‌లో ధోని నా ద‌గ్గ‌రకు వ‌చ్చాడు. తాను రెస్ట్ రూమ్‌కు వెళ్తాన‌ని రెండు- మూడు ఓవ‌ర్ల పాటు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని చెప్పాడు. మా జ‌ట్టుకు నాయ‌క‌త్వ స్థానంలో ఉన్న‌ ధోని మాట‌ను అంగీక‌రించి కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాను. 44వ ‌ఓవ‌ర్‌లో బ‌య‌ట‌కు వెళ్లిన ధోని 45వ‌‌ ఓవ‌ర్ పూర్తి కాగానే తిరిగి వ‌చ్చాడు. 

కానీ నేను కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆ ఒక్క ఓవ‌ర్ నాకు చాలా క‌ష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒక‌వైపు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌తో పాటు బౌల‌ర్ వేస్తున్న బంతిని గ‌మ‌నించాలి. నిజంగా ఇది చాలా క‌ష్టం. అప్ప‌డు అర్థ‌మ‌యింది.. వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు ఎంత‌ క‌ష్టంగా ఉంటాయో.. పైగా ధోని కెప్టెన్‌గా ఉండ‌డంతో అటు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌పై కూడా ఫోక‌స్ పెట్టేవాడు... అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు.

కొన్ని ఓవర్లపాటు వికెట్ కీపింగ్ చేయి అంటూ మైదానం వీడేముందు ధోనీ నాతో చెప్పాడు. కేప్టెన్‌గా తన మాటలను గౌరవించి ధోనీ తిరిగి మైదానంలోకి వచ్చేవరకు నేను వికెట్ కీపింగ్ చేస్తూనే కెప్టెన్సీ బాధ్యతలను కూడా తాత్కాలికంగా స్వీకరించాను. కావాలంటే ఇది ఎప్పుడు జరిగిందో ధోనీనే స్వయంగా అడగవచ్చు అంటూ కోహ్లీ ముక్తాయించాడు. 

వికెట్ కీపింగ్ చేస్తూనే బౌలర్ సంధించే ప్రతి బంతిపైనా దృష్టి పెడుతా మైదానంలో జట్టును మార్చడం సామాన్యమైన పని కాదు. ధోనీ ఎంత ఒత్తిడిని భరించాడో ఆ క్షణంలో నాకు అర్థమైంది అని కోహ్లీ వివరించాడు.

పాంటింగ్‌ కన్నా.. ధోనీ మిన్న

కాగా, పాంటింగ్‌కన్నా..ఎంఎస్ ధోనీ ఉత్తమ కెప్టెన్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీది తేల్చాడు. సారథిగా వారిద్దరిలో ఎవరు బెటర్‌ అని ట్విటర్‌లో అభిమానులు ప్రశ్నించినప్పుడు మహీయేనని అఫ్రీది తడుముకోకుండా బదులిచ్చాడు. యువకులతో కూడిన జట్టును బలీయంగా తయారు చేయడమే ధోనీ కెప్టెన్సీకి తిరుగులేని నిదర్శనమని అఫ్రీది పేర్కొన్నాడు. 

‘కెప్టెన్‌గా పాంటింగ్‌కంటే కూడా నేను ధోనీకి ఎక్కువ మార్కులు వేస్తా. యువకులను తీర్చిదిద్ది పటిష్టమైన భారత జట్టును తయారు చేశాడు’ అని వివరించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు..2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ఏకైక సారథి ధోనీ కావడం విశేషం. మరోవైపు కెప్టెన్‌గా పాంటింగ్‌ 2003, 2007ల్లో వరుసగా రెండు వన్డే వరల్డ్‌ కప్‌లను ఆస్ట్రేలియాకు అందించాడు. 

ధోనీ మొత్తం 331 (టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు కలిపి) మ్యాచ్‌లలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని విజయ శాతం 53.78. ఇక 324 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు సారథ్యం వహించిన పాంటింగ్‌.. ధోనీ కన్నా మెరుగ్గా 67.90 విజయ శాతం కలిగి ఉన్నాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle