newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ధోనీ కెప్టెన్ కావడం అతిపెద్ద పెద్ద పొరపాటు.. బాంబుపేల్చిన గంభీర్

16-06-202016-06-2020 10:05:44 IST
Updated On 16-06-2020 11:12:32 ISTUpdated On 16-06-20202020-06-16T04:35:44.124Z16-06-2020 2020-06-16T04:35:40.948Z - 2020-06-16T05:42:32.565Z - 16-06-2020

ధోనీ కెప్టెన్ కావడం అతిపెద్ద పెద్ద పొరపాటు.. బాంబుపేల్చిన గంభీర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ దిగ్గజాలపై వరుసగా పరుషవాక్యాలు సంధించడంలో ఎన్నడూ వెనకాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈసారి మహేంద్రసింగ్ ధోనీపై పడ్డాడు. అయితే గతంలో తాను టీమిండియాలో స్థానం కోల్పోవడానికి ధోనీయే కారణమంటూ అనేకసార్లు ధ్వజమెత్తిన గంభీర్ ఈసారి ధోనీపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ కావడం అతి పెద్ద పొరపాటు అంటూ ముక్తాయించిన గంభీర్ తన ఉద్దేశమేమిటో వెంటనే వివరించాడు.

టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని పేరు చెప్పగానే దేశవిదేశ ఆటగాళ్లు, అభిమానులు అందరూ మెచ్చుకునేది అతడి నాయకత్వ లక్షణాలను. ప్రత్యర్థి వ్యూహాలను చేధిస్తూ.. క్లిష్ట సమయాలలో కూల్‌గా నిర్ణయాలను తీసుకుని టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే ఎంఎస్‌ ధోని కెప్టెన్‌ కావడంతో క్రికెట్‌ ప్రపంచం ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం కోల్పోయిందని టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

ఓ స్పోర్ట్స్‌ షోలో పాల్గొన్న గంభీర్‌ అనేక ఆసక్తికర విషయాలపై చర్చించారు.

ఎంఎస్‌ ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ అద్భుత బ్యాట్స్‌మన్‌ను మిస్సయింది. అతను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసుంటే ధోనిలోని ఓ భిన్నమైన ఆటగాడిని క్రికెట్‌ ప్రపంచం చూసేది. మూడో స్థానంలో అతడు బ్యాటింగ్‌ చేసుంటే ఎన్నో రికార్డులు బద్దలయ్యేవి. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచేవాడు.

ఎందుకంటే నాణ్యమైన బౌలర్లున్న సమయంలో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగుల వరద పారించాడు. అలాగే కొనసాగి ఉంటే అన్ని బ్యాటింగ్‌ రికార్డులు అతడి పేరుపైనే ఉండేవి. గతంతో పోలిస్తే ప్రస్తుత క్రికెట్‌లో నాణ్యమైన బౌలర్లు లేరని నా అభిప్రాయం. శ్రీలంక, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ జట్లు పూర్తిగా బలహీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం క్రికెట్‌లో నాణ్యత లోపించింది. ఈ పరిస్థితుల్లో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చుంటే పరుగుల వరద పారించే వాడు’ అని గంభీర్‌ వివరించాడు. ఇక 16 వన్డే మ్యాచ్‌ల్లో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇరగదీసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 

2004లో విశాఖపట్నంలో వన్డే మ్యాచ్‌లో శుభారంభం చేసి పాకిస్తాన్‌ను ఊచకోత కోసిన ధోనీ, తర్వాత నంబర్ 3 బ్యాట్స్‌మన్‌గా ముందుకు రావడంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2005లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో 3వ స్థానంలో బ్యాటింగుకు వచ్చిన ధోనీ రెండు అత్యద్భుతమైన సెంచరీలు సాధించి షాక్ తెప్పించాడు. మామూలు సెంచరీలు కావవి. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసి ఆనాటికి జులపాల ధోనీ చేసిన మర్చిపోలేని సెంచరీలు అవి.

నంబర్ 3 స్థానంలో 16 వన్డేలు ఆడిన ధోనీ దాదాపు 82 సగటుతో 993 పరుగులు సాధించాడు. ఈక్రమంలో 100 శాతం స్ట్రైక్ రేటుతో ధోనీ అదరగొట్టాడు. ఇక వన్డేల్లో సాధించిన 10,773 పరుగుల్లో ఎక్కువగా 5 మరియు 6 స్థానాల్లో ఆడి సాధించినవే.

టీమిండియా కేప్టెన్ అయ్యాక ధోనీ ప్రశాంతతకు, కచ్చితమైన అంచనాకు మారుపేరుగా నిలిచాడు. అయితే కెప్టెన్‌గా కంటే ధోనీ మూడో స్థానంలో బ్యాట్స్‌మన్‌గా కొనసాగి ఉంటే రికార్డుల ధోనీని చూసేవారమని గంభీర్ ప్రకటించడం చాలామంది ఆలోచనలో పడేసింది.

 

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

   2 hours ago


పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

   2 hours ago


కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

   8 hours ago


ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

   9 hours ago


క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

   04-07-2020


రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

   04-07-2020


విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

   03-07-2020


శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

   03-07-2020


సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

   02-07-2020


రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

   02-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle