newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీలాంటి వారు తరానికొక్కరే కనిపిస్తారు. తనను బలవంతపెట్టొద్దు.. నాసిర్ హుస్సేన్

12-04-202012-04-2020 14:23:37 IST
Updated On 12-04-2020 14:26:18 ISTUpdated On 12-04-20202020-04-12T08:53:37.949Z12-04-2020 2020-04-12T08:53:34.712Z - 2020-04-12T08:56:18.667Z - 12-04-2020

ధోనీలాంటి వారు తరానికొక్కరే కనిపిస్తారు. తనను బలవంతపెట్టొద్దు.. నాసిర్ హుస్సేన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు 8 నెలలుగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇక భారత్ తరపున ఆడే అవకాశాలు ఐపీఎల్ రద్దుతో పూర్తిగా మూసుకుపోయినట్లే భావిస్తున్నారు మళ్లీ జాతీయ జట్టుకు ఆడతాడా, అసలు ఆడే అవకాశం ఉందా ఎవరికీ తెలియదు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడితే టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని వినిపించినా.... లీగ్‌ జరగడం సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్‌ అయినట్లేనని, అధికారిక ప్రకటనే మిగిలిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

కానీ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ స్పందించాడు. ధోనిలాంటి అరుదైన క్రికెటర్లను బలవంతంగా రిటైర్మెంట్‌ వైపు తోస్తే అది జట్టుకు మేలు చేయదని అతను వ్యాఖ్యానించాడు. ‘ఒక్కసారి ధోని రిటైర్‌ అయితే అతడిని మళ్లీ వెనక్కి పిలిపించలేం. క్రికెట్‌ ప్రపంచమంతా కీర్తించే దిగ్గజాలు కొందరే ఉంటారు. అలాంటివారు తరానికొక్కరే కనిపిస్తారు. ధోని కూడా అలాంటి ఆటగాడే. కాబట్టి అతడిని రిటైర్మెంట్‌ ప్రకటించమని బలవంత పెట్టవద్దు. అని నాసిర్ చెప్పాడు.

ప్రస్తుత తరుణంలో తన మానసిక పరిస్థితి ఏమిటో ధోనికి మాత్రమే తెలుసు. సెలక్టర్లు ఎంపిక చేస్తే ఎలా తమ బాధ్యత నెరవేర్చాలో ఆటగాళ్లకు తెలుసు. అయితే ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకునే సత్తా ధోనికి ఉందా అనేది ఎవరైనా చూస్తారు. నా దృష్టిలో మాత్రం భారత జట్టుకు మరికొంతకాలం సేవలు అందించగల సామర్థ్యం ఇంకా ధోనిలో ఉంది’ అని హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచకప్‌లో ఒకటి, రెండు మ్యాచ్‌లలో ధోని తన సహజశైలిలో ఆడలేకపోయాడనే విషయం మాత్రం వాస్తవమని ఇంగ్లండ్‌ మాజీ సారథి అంగీకరించాడు.

వన్డే ప్రపంచ కప్‌లో లక్ష్య ఛేదనలో ఒకట్రెండుసార్లు అతను లెక్క తప్పినట్లు అనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను ఏదో కారణం చేత చివరి వరకు కూడా నెమ్మదిగానే ఆడే ప్రయత్నం చేయడం నాకు గుర్తుంది. అయితే ఓవరాల్‌గా ధోని గొప్ప ఆటగాడు. కాబట్టి అతని రిటైర్మెంట్‌ను కోరుకునేవారు ఆలోచించి వ్యాఖ్య చేస్తే బాగుంటుంది’ అని నాసిర్‌ హుస్సేన్‌ సూచించాడు. 

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 38 ఏళ్ల ధోని ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టి20 ఫార్మాట్‌లలో కొనసాగుతున్నాడు. 

ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో అద్భుత కెప్టెన్‌గా పేరొందిన నాసిర్ హుసేన్ 1999-2003 వరకు ఇంగ్లంట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle