newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం

06-04-202006-04-2020 22:16:13 IST
2020-04-06T16:46:13.356Z06-04-2020 2020-04-06T16:46:11.067Z - - 15-05-2021

ధోనీని చెడతిట్టేశాను... ఇప్పటికీ బాధపడుతుంటా.. నెహ్రా విచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ ఫీల్డ్‌లోకి అప్పుడే అడుగుపెట్టిన మహేంద్రసింగ్ ధోనీని ఒక సందర్భంలో భయంకరంగా తిట్టేసినందుకు ఇప్పటికీ బాధపుడుతూ ఉంటానని టీమిండియా మాజీ స్పీడ్‌స్టర్ అశీష్ నెహ్రా గుర్తుకు తెచ్చుకున్నాడు. తన బౌలింగులో పాకిస్తాన్ ఆల్ రౌండర్ షహీద్ అప్రిదీ కొట్టిన బంతి కీపర్ ధోనీ, ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రాహుల్ ద్రావిడ్ మధ్యలోంచి దూసుకెళ్లి క్యాచ్ మిస్ అవటంతో వెర్రికోపం వచ్చి ధోనీని తిట్టేశానని నెహ్రా తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. ఆరోజు ధోనీ పట్ల తాను ప్రవర్తించిన తీరు పట్ల ఏమాత్రం సమర్థించుకోలేనని నెహ్రా ఒప్పుకున్నాడు. 

మైదానంలో ఆ సంఘటన జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు కావస్తోంది. 2005లో అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్‌లో జరిగిందా ఘటన. అంతకుముందే విశాఖపట్నంలో పాకిస్తాన్‌పై రెండో వన్డేలో ధోనీ తన మొట్టమొదటి వన్డే సెంచరీని సాధించడమే కాకుండా పాక్ బౌలింగ్‌ను చితకబాది మంచి ఊపులో ఉన్నాడు. 

అందరూ విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలోనే తాను ధోనీని తిట్టినట్లు భావిస్తూ వచ్చారు కానీ వాస్తవానికి అది అహమ్మదాబాద్‌లో జరిగిన నాలుగో వన్డేలో జరిగిన ఘటన అని నెహ్రావివరించాడు. ధోనీని గట్టిగా నేను అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడి అది కాస్తా వైరల్ అయిందని నెహ్రా తెలిపాడు. 

పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ షహీద్ అఫ్రీది అప్పటికే నా బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ బాది మంచి ఊపులో ఉన్నాడు. అఫ్రీదీకి ఛాన్స్ వస్తే ఆటతీరు ఎలా మారిపోతుందో అందరికీ తెలుసు. పైగా భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రేక్షకుల్లోనే కాకుండా ప్లేయర్ల మధ్య కూడా ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆ తర్వాతి బంతికే అఫ్రీదీని ఔట్ చేసే ఛాన్స్ ఇచ్చాను. కాని అది ఇద్దరు ఆటగాళ్ళను దాటుకుని క్యాచ్ మిస్సయిపోవడంతో పట్టలేని ఆగ్రహం కలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే శాంతాన్ని కోల్పోయాను. ఆవిధంగా ఆట మధ్యలో ప్రశాంతతను కోల్పోవడం అదే మొదటి సారి కాదు. ప్రతి ఆటగాడికీ అలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. కానీ ద్రావిడ్, ధోనీ మాత్రం మ్యాచ్ ముగిసాక నాతో బాగానే ఉన్నారు. అయితే వారి స్నేహస్వభావం నా ప్రవర్తనను ఏ రకంగానూ సమర్థించబోదు అని  నెహ్రా వివరించాడు.

ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉందంటే దానిక్కారణం దాంట్లో ధోని ఉండటమే.  కోహ్లీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతడికి ఒక అవార్డు ఇస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ఊహించుకోండి. ఆ చిత్రం ఎందుకు ఫేమస్ అయివుంటుందంటే దాంట్లో కోహ్లీ ఉన్నాడు కాబట్టి. అంతే కానీ ఆచిత్రంలో నేను ఉన్నందువల్ల దానికి అంత పాపులారిటీ వచ్చినట్లు కాదు కదా అంటూ నెహ్రా జోక్ చేశాడు. 

ధోనీని అలా తిడుతూ నేను కనిపించిన ఆ వీడియోను రేపు నా పిల్లలు చూస్తే దానికి నేను వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆరోజు మైదానంలో ఆలా ఎందుకు ప్రవర్తించావు నాన్నా అని అడిగితే నేను కచ్చితంగా జవాబిచ్చుకోవాలి. అయితే ఒకటి మాత్రం నిజం. ఆ వీడియోలో కనిపించిన ఆ దృశ్యం నేను గర్వించేది మాత్రం కాదు అని నెహ్రా నిజాయితీగా ఒప్పుకున్నాడు.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle