ధోనీని అప్పట్లోనే కెప్టెన్సీ నుంచి తీసేయాలన్నారు.. శ్రీనివాసన్
18-08-202018-08-2020 13:21:11 IST
2020-08-18T07:51:11.341Z18-08-2020 2020-08-18T07:51:05.120Z - - 12-04-2021

సుదీర్ఘ క్రికెట్ అనంతరం భారంగా ఆటకు, కెరీర్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2011లోనే కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడా.. వన్డే ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన ధోనీని కెప్టెన్సీనుంచి తొలగించాలని టీమిండియా సెలెక్టర్ స్వయంగా ప్రకటించారా.. బీసీసీఐ నాటి అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అడ్డుకోకుంటే మహేంద్ర సింగ్ కెప్టెన్సీ ఆరోజే ఊడిపోయేదా.. సంచలనం కలిగిస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నిజం అనే చెప్పాలి. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ నిజం ఇప్పుడు వెలుగులోగి వస్తోంది. ఎమ్మెస్ ధోని నాయకత్వంలో భారత జట్టు 2011 సంవత్సరం వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని నీరాజనాలందుకుంది. కెప్టెన్‌గా ధోని శిఖరస్థాయిలో నిలిచాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్ చేతిలో 0–4తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా... ఆ తర్వాత కొద్ది రోజులకే ఆస్ట్రేలియా చేతిలో కూడా ఇదే తరహాలో 0–4తో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో ధోని నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో టెస్టు సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ధోనిని కెప్టెన్సీనుంచి తప్పించాలని సెలక్టర్లు భావించారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నాటి అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ దీనిని అడ్డుకున్నారు. తన విశేషాధికారాలు ఉపయోగించి ధోనిని కెప్టెన్‌గా కొనసాగేలా చేశారు. ఈ విషయంలో శ్రీనివాసన్ పాత్రపై అనేక సార్లు వార్తలు వచ్చినా... ఇంత కాలం ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్ అనంతరం దీనిని శ్రీనివాసన్ ధ్రువీకరించారు. తానే ఎమ్మెస్ కెప్టెన్సీ కోల్పోకుండా ఆపినట్లు వెల్లడించారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాది 2008నుంచే శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డునుంచి జరిగే ప్రతీ ఎంపికకు అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ‘ధోనిని వన్డే జట్టు కెప్టెన్సీనుంచి తొలగించాలని ఒక సెలక్టర్ (మొహీందర్ అమర్నాథ్) భావించారు. అసలు అతడిని ఎలా తప్పించగలరనేదే నా ప్రశ్న. కొన్నాళ్ల క్రితమే ధోని ప్రపంచ కప్ గెలిపించాడు. అసలు అతని స్థానంలో ఎవరిని కెప్టెన్ చేయాలో కూడా వారికి తెలీదు. అసలు సమావేశానికి ముందు నేను ధోని కెప్టెన్ కాకపోవడం అనే మాటే ఉదయించదని స్పష్టంగా చెప్పేశాను. సెలవు రోజున నేను గోల్ఫ్ ఆడుతున్న సమయంలో అప్పటి బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలే నాకు ఈ విషయం తెలియజేశారు. సెలక్టర్లు ఇంకా కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. ధోనిని ఆటగాడిగా మాత్రమే తీసుకుంటామంటున్నారని నాతో ఆయన చెప్పారు. నేను వెంటనే నాకున్న అన్ని అధికారాలను ఉపయోగించాను’ అని శ్రీనివాసన్ గుర్తు చేసుకున్నారు. సెలక్టర్లకే తుది ఎంపిక అవకాశం ఇచ్చి ఉంటే ధోనీని ఆనాడే వన్డే క్రికెట్ కెప్టెన్సీ నుంచి తొలగించి ఉండేవారు. ఇంతకంటే మించిన అన్యాయం మరొకటి ఉండేది కాదు. అందుకే తక్షణం నేను జోక్యం చేసుకుని నా వంతు పాత్ర పోషించి ధోనీని నిలబెట్టాను అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని తనకు నచ్చినంత కాలం చెన్నై జట్టు తరఫున ఆడవచ్చని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. గత శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఈ సంవత్సరం యూఏఈలో జరగనున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ధోనీ లేని మ్యాచ్‌లు ఇక చూడను.. వీరాభిమాని బషీర్ వ్యాఖ్య ప్రపంచకప్‌లో భారత్–పాక్ మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం టికెట్ దక్కించుకోవడం మహామహులకే సాధ్యం కాదు. కానీ మహేంద్ర సింగ్ ధోని తన పాకిస్తాన్ అభిమాని కోసం 2011లో ఒక టికెట్ ఏర్పాటు చేశాడు! ఆ అదృష్టవంతుడి పేరు మొహమ్మద్ బషీర్. పాక్‌లోని కరాచీలో పుట్టి అమెరికాలో స్థిరపడిన 65 ఏళ్ల బషీర్‌ను అంతా ‘చాచా చికాగో’ అని పిలుస్తారు. హైదరాబాద్ మహిళను పెళ్లి చేసుకున్న ఆయనకు ధోనితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడూ భారత్–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినా...తన ప్రత్యేక వేషధారణతో మ్యాచ్‌కు హాజరై అతను ధోనికి మద్దతు తెలిపేవాడు. సొంత దేశస్తులు ‘ద్రోహి’ అన్నా బషీర్ పట్టించుకోలేదు. ఇప్పుడు ధోని రిటైర్ కావడంతో ఇకపై భారత్–పాక్ మధ్య జరిగే ఎలాంటి మ్యాచ్ కూడా చూడనని అతను ప్రకటించాడు. ‘ధోని రిటైర్ అయ్యాడంటే నేను కూడా అయినట్లే. ఎక్కడెక్కడికో వెళ్లి అతని లేని మ్యాచ్‌లు చూడటం నాకిష్టం లేదు. ధోనితో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అతనంటే నాకెంతో ప్రేమ. ధోని కూడా నాపై అదే అభిమానం చూపించాడు. ఏ మైదానంలో కనిపించినా పలకరించడం, తన వైపుఏదో ఒక బహుమతి ఇవ్వడం అతను ఆపలేదు’ అని బషీర్ వ్యాఖ్యానించాడు.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
10 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
20 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
19 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా