newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీకి మోడీ రెండుపేజీల లేఖ.. థ్యాంక్స్ చెప్పిన మహి

21-08-202021-08-2020 11:58:23 IST
Updated On 21-08-2020 16:06:08 ISTUpdated On 21-08-20202020-08-21T06:28:23.294Z21-08-2020 2020-08-21T06:28:17.674Z - 2020-08-21T10:36:08.968Z - 21-08-2020

ధోనీకి మోడీ రెండుపేజీల లేఖ.. థ్యాంక్స్ చెప్పిన మహి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా.. అతడ్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు. గత శనివారం తాను అంతర్జాతీయ క్రికెట్‌‌ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ధోనీ.. అందరికీ ఊహించిన షాకిచ్చాడు.

కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కి అందించిన ధోనీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టీమిండియాని నెం.1 స్థానంలో నిలిపాడు. దాంతో.. దేశంలోని క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ‘థ్యాంక్స్ ధోనీ’ అంటూ ట్వీట్స్ చేశారు.

ధోనీ రిటైర్మెంట్‌పై తాజాగా స్పందించిన ప్రధాని మోడీ.. ఓ రెండు పేజీల లేఖని ధోనీకి పంపారు. అందులో ధోనీ అంటే కేవలం గణాంకాలు, మ్యాచ్ రికార్డ్‌లుగా గుర్తించుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడిన మోడీ.. అతడ్ని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా తగదన్నారు.

ఒక క్రికెటర్‌గానే కాకుండా తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోడీ లేఖపై మహేంద్రసింగ్ ధోనీ కూడా స్పందించాడు.

https://www.photojoiner.net/image/JwIXd8wC

ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని చెప్పుకొచ్చిన ధోనీ.. మోడీకి థ్యాంక్స్ చెప్పాడు. సాధారణంగా ధోనీ తనకి వచ్చే ప్రశంసలు, శుభాకాంక్షలపై స్పందించడు.

2011 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాని విజేతగా నిలిపిన తర్వాత మహేంద్రసింగ్ ధోనీకి ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదా లభించింది. ఆ తర్వాత ఆర్మీతో కలిసి కఠిన శిక్షణ తీసుకున్న ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు వారాలు ఆర్మీతో కలిసి పనిచేశాడు.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పడంతో ఇక ఏటా కొన్ని రోజులు ఆర్మీతో కలిసి పనిచేయనున్నట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle