newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ధోనీకి జరిమానా.. అసలేం జరిగింది?

12-04-201912-04-2019 14:40:49 IST
2019-04-12T09:10:49.496Z12-04-2019 2019-04-12T09:10:46.401Z - - 22-07-2019

ధోనీకి జరిమానా.. అసలేం జరిగింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ధోనీ కాస్త అతి చేశాడని తోటి క్రికెటర్లు కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి జరిమానా పడింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే, ధోని చర్యను ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ధోనీ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసినందుకు గానూ ఐపీఎల్ యాజమాన్యం ఆర్టికల్‌ 2.20 ప్రకారం శిక్షలు విధిస్తుంది. దీంతో ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత పడింది. అసలేం జరిగిందంటే.. జైపూర్‌ వేదికగా గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ చివరిదశలో ఉండగా ... క్రీజులో ఉన్న శాంట్నర్‌కు రాజస్థాన్‌ బౌలర్‌ బెన్‌ స్టోక్స్‌.. వికెట్ల కంటే ఎత్తులో బంతిని విసిరాడు.

మైదానంలో అంపైర్లులుగా ఉన్న ఉలాస్‌ గాందే, బ్రూస్‌ ఆక్స్‌ఫర్డ్‌ తొలుత నోబాల్‌గా ప్రకటించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. దీంతో ధోని మైదానంలోకి ఆవేశంగా వచ్చి అంపైర్లతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు.  ధోనీ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో 100 విజయాల మైలు రాయి అందుకున్నాడు. అయితే ఈ చిన్న సంఘటన కారణంగా ధోనీ విమర్శల పాలయ్యాడు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle