newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ

07-12-201907-12-2019 17:07:56 IST
Updated On 11-12-2019 12:52:39 ISTUpdated On 11-12-20192019-12-07T11:37:56.900Z07-12-2019 2019-12-07T11:37:50.144Z - 2019-12-11T07:22:39.138Z - 11-12-2019

ధోనీకి కృతజ్ఞతలతో సరిపెట్టుకోలేం.. తనకు ఏమిచ్చినా సరిపోదు: గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు చెప్పడంతో సరిపెట్టుకోలేమని ధోనీ వంటి దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్‌ అనేది అతడు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ధోని గురించి చర్చలకు ముగింపు పలుకుదాం అని గంగూలీ చెప్పాడు

గత కొంత కాలంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ గురించి రోజు ఏదొక వార్త హల్‌చల్‌ చేస్తూనే ఉంది. తనను జనవరి వరకూ క్రికెట్‌ గురించి ఏమీ అడగొద్దని ధోని స్పష్టం చేసినా అతని భవిష్య ప్రణాళికపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి స్పష్టతనిచ్చాడు.

‘ధోని భవిష్య ప్రణాళికపై అతనికే వదిలిపెడదాం. దాని గురించి నేను పట్టించుకోవడం లేదు. అది టీమిండియా క్రికెట్‌ అధికారులు, సెలక్షన్‌ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్‌ అంశాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. నేనేమీ చెప్పలేను. నేను బీసీసీఐ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత ధోని చర్చించా.  దానిపై టీమిండియా సెలక్టర్టు నిర్ణయం తీసుకుంటారు. భారత క్రికెట్‌కు ధోని చాలా చేశాడు. అతనికి బీసీసీఐ ఏమిస్తే సరిపోతుంది. కేవలం థాంక్స్‌తో అతని సేవలకు ముగింపు చెప్పలేం. ధోని రిటైర్మెంట్‌ అనేది అతడు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ధోని గురించి చర్చలకు ముగింపు పలుకుదాం. దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాలి’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

"బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ధోనితో మాట్లాడుతున్నాను. అతడికి టచ్‌లోనే ఉన్నాం. మేము విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడుతున్నాం. మేము సెలెక్టర్లతో మాట్లాడతాము. ఆ విషయాన్ని టీమిండియా క్రికెట్‌ అధికారులు, సెలక్షన్‌ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్ అంశం ప్రస్తుతానికి అక్కడే ఉంది" అని గంగూలీ తెలిపాడు.

కాగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. అప్పటినుంచి  పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ధోని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా లేదా క్రికెటర్‌గా కొనసాగుతాడా అనే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌లో ధోనినే ప్రధాన చర్చగా మారిపోయాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle