newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోని న్యూలుక్‌ వైరల్‌

20-09-202020-09-2020 16:34:48 IST
2020-09-20T11:04:48.367Z20-09-2020 2020-09-20T11:04:45.961Z - - 23-04-2021

ధోని న్యూలుక్‌ వైరల్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించాడు. ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌ కు మూడు టైటిల్స్‌ అందించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతతను కోల్పోడు. అందుకనే అభిమానులు అంతా ముద్దుగా మిస్టర్‌ కూల్‌ అని పిలుచుకుంటారు. 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్ న్యూజిలాండ్‌- టీమీండియా మ్యాచ్‌లో ధోని చివరిసారిగా కనిపించాడు. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం తరువాత ధోని మైదానంలో అడుగు పెట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ధోనిని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

ఈ మ్యాచ్‌లో ధోని న్యూ లుక్‌తో కనిపించాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు. అయితే ధోని న్యూలుక్‌పై అతడి అభిమానులు సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యాను ధోని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. సూపర్‌ హిట్‌ మూవీ సింగంలోని సూర్య లుక్‌ మాదిరిగానే ప్రస్తుతం ధోని తన గడ్డం స్టయిల్‌ మార్చుకున్నారు. ప్రస్తుతం ధోని లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేసిన రోజుల్లో ధోని జులపాల జట్టుకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు సాధించింది. చేధనలో అంబటి రాయుడు (71; 48బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో.. చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.  మొదటి మ్యాచ్‌లో ముంబై పై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle