newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ధోని ని ఇక వ‌న్డేల్లో చూడలేమా..!

10-01-202010-01-2020 17:28:47 IST
2020-01-10T11:58:47.444Z10-01-2020 2020-01-10T11:58:42.447Z - - 18-01-2020

ధోని ని ఇక వ‌న్డేల్లో చూడలేమా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ని ఇక వ‌న్డేల్లో చూడ‌లేమా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ధోని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ పై ప్ర‌స్తుత టీంఇండియా కోచ్ ర‌వి శాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ర‌విశాస్త్రి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి మిస్ట‌ల్ కూల్ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ లో క‌న‌ప‌డ‌డ‌ని అర్థం అవుతుంది. అయితే టీ20 ల్లో కొనసాగే అవకాశం ఉంది.   

2019లో ప్ర‌పంచ క‌ప్ లో న్యూజిలాండ్ తో ఆఖ‌రి మ్యాచ్ ఆడాడు మ‌హేంద్ర సింగ్ ధోని. ఆ మ్యాచ్ లో ర‌నౌటై క‌న్నీళ్ల‌తో వెనుదిరిగాడు. ప్ర‌పంచ క‌ప్ ముగిసి ఆరు నెల‌లు కావ‌స్తున్నా మ‌హీ ఇంత వ‌ర‌కు గ్రౌండ్ లో అడుగు పెట్ట‌లేదు. రిటైర్ మెంట్ పై ఎన్నో ఊహాగానాలు వినిపించిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు వాటిపై స్ప‌ష్ట‌త ఇవ్వలేదు. జ‌న‌వ‌రి త‌రువాత త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని మ‌హి చెప్పిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి మిస్ట‌ల్ కూల్ రిటైర్ మెంట్ పై మ‌రింత స్ప‌ష్ట‌తనిచ్చే విధంగా మాట్లాడాడు. నేను ధోనితో మాట్లాడాను. ఏం చర్చించుకున్నామనేది మాకు మాత్రమే తెలుసు. అయితే టెస్టులకు గుడ్ బై చెప్పినట్లుగానే త్వరలో అతను వన్డేలనుంచి కూడా తప్పుకోబోతున్నాడు.  ధోని తన వన్డే కెరీర్ ముగించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.

అతని వయసును బట్టి చూస్తే టి20 ఫార్మాట్లోనే ఆడాలనుకుంటున్నాడు. సాధన మొదలు పెట్టి ఐపీఎల్ బరిలోకి దిగిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి’ అని రవిశాస్త్రి వివరించాడు. ఐపీఎల్లో బాగా ఆడితే టి20 ప్రపంచ కప్ జట్టులోకి ఎంపికయ్యేందుకు ధోనికి మంచి అవకాశాలు ఉన్నాయని కోచ్ అభిప్రాయ పడ్డాడు. ప్రపంచ కప్లాంటి టోర్నీకి అనుభవంతో పాటు ఫామ్ కూడా కీలకమని శాస్త్రి అన్నాడు.

ర‌విశాస్త్రి వ్యాఖ్య‌లు బ‌ట్టి వ‌న్డేల్లో ధోనిని చూడ‌లేమ‌ని అర్థం అవుతుండ‌గా ఐపీఎల్ లో  రాణించ‌డం పైనే మ‌హీ  భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది. మ‌ళ్లీ టిమిండియా జెర్సీలో మ‌హీని చూస్తామో లేదో..


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle