newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ధోని తర్వాత కెప్టెన్ అంటే రోహిత్ శర్మనే.. సురేష్ రైనా వ్యాఖ్య

30-07-202030-07-2020 08:09:44 IST
2020-07-30T02:39:44.548Z30-07-2020 2020-07-30T02:39:41.446Z - - 03-08-2020

ధోని తర్వాత కెప్టెన్ అంటే రోహిత్ శర్మనే.. సురేష్ రైనా వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ రంగంలో నాయకత్వ లక్షణాల విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రగామిగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకో టీమిండియా కెప్టెన్ పేరు ప్రస్తావిస్తే ధోనీకి ముందు, తర్వాత అనే కొలమానాలు పుట్టుకొచ్చేశాయి. మిన్నువిరిగి మీద పడినా ప్రశాంతంగా ఆలోచించి వేగంగా ఆట తీరును మలుపు తిప్పే కళ ధోనీకే సొంతం. కానీ ధోనీ తర్వాత అలాంటి ఘనమైన కెప్టెన్సీ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అంటే దానికి తగ్గ అర్హతలు ఒక్క వ్యక్తికే ఉన్నాయని మీడియాలో కూడా చర్చలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. 

ఈ క్రమంలో టీమిండియా తదుపరి కెప్టెన్ లక్షణాలను రోహిత్ శర్మలోనే చూశానని క్రికెటర్ సురేశ్ రైనా తేల్చి చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టులో హిట్‌మ్యాన్‌‌గా పేరొందిన రోహిత్ శర్మ మరో ధోనిలాంటి వాడని రైనా ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రతీ ఆటగాడి సూచనలు, సలహాలకు విలువనిస్తాడని.. అందరినీ గౌరవిస్తాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్సీలో ఆడటం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుందని రైనా పేర్కొన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ధోని తర్వాత జట్టు సారథిగా అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలను రోహిత్‌ శర్మలో చూశానని క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. 

సూపర్‌ ఓవర్‌ పోడ్‌కాస్ట్‌ తాజా ఎపిసోడ్‌లో భాగంగా సౌతాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినితో మాట్లాడిన ఈ ఎడమచేతి వాటం క్రికెటర్‌ తన క్రీడా జీవితంలోని అనుభవాల గురించి పంచుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ గురించి రైనా మాట్లాడుతూ.. ‘తను చాలా కామ్‌గా ఉంటాడు. ఎదుటి వాళ్లు చెప్పేది ఓపికగా వింటాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. ముందుండి నడిపిస్తాడు. కెప్టెన్‌గా ఉన్నా డ్రెస్సింగ్‌ రూంలో అందరినీ గౌరవిస్తాడు. ప్రతీ ఒక్కరు కెప్టెన్‌లాంటి వాళ్లే కదా అంటాడు. తన సారథ్యంలో ఆసియా కప్‌ ఆడాను. అప్పుడు మరింత దగ్గరగా తనను గమనించాను. 

ముఖ్యంగా శార్దూల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి యువ ఆటగాళ్లను రోహిత్ ప్రోత్సహించిన తీరు అమోఘం. నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్‌ శర్మ పేరే చెబుతాను. ధోనిలాగే తను కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు. తనలాగే ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచాడు. జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను. సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను’’ అని రైనా చెప్పుకొచ్చాడు. 

రైనా వ్యాఖ్యలు నిజమేనని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మనే. గత ఎనిమిదేళ్లలో రోహిత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. పైగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ గాయపడినా, లేక విశ్రాంతి తీసుకోవలసి వచ్చినా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి రోహిత్ ఎన్నడూ వెనుకాడలేదు. రోహిత్ పది వన్డేలకు కేప్టెన్‌గా బాధ్యత తీసుకుంటే ఎనిమిది వన్డేలలో గెలుపు సాధించిపెట్టాడు. ఇక ఇరవై టి20 మ్యాచ్‌లకు నాయకత్వం వహిస్తే 16 మ్యాచ్‌లలో భారత్‌న విజయపథంలో నిలిపాడు.

కాగా ధోని కెప్టెన్సీలో టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సురేశ్‌ రైనా.. రోహిత్‌ కెప్టెన్సీలో నిదహాస్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle