newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోని కొట్టిన భారీ సిక్సర్ కు షాక్ తిన్న మురళీ విజయ్..!

11-09-202011-09-2020 10:51:15 IST
2020-09-11T05:21:15.577Z11-09-2020 2020-09-11T05:21:12.718Z - - 10-04-2021

ధోని కొట్టిన భారీ సిక్సర్ కు షాక్ తిన్న మురళీ విజయ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహేంద్ర సింగ్ ధోని అంటేనే భారీ సిక్సర్లకు కేరాఫ్ అడ్రెస్.. ధోని విధ్వంసాన్ని చూసి చాలా రోజులే అవుతోంది. ఐపీఎల్-2020 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోని ప్రాక్టీస్ సెషన్ లో చెమటోడుస్తూ ఉన్నాడు.

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అందులో ఆ జట్టు ప్రాక్టీస్ చేస్తుండడాన్ని గమనించవచ్చు. ఆ వీడియోలో ధోని భారీ సిక్సర్ ను కొట్టడం చూస్తే అభిమానులు ఎంతో ఆనందానికి గురవుతున్నారు. ఈ సిక్సర్ ను చూసి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మురళీ విజయ్ కూడా షాక్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్.. ధోని కొట్టిన షాట్ కు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కరినీ అబ్బుర పరుస్తూ ఉంటుంది.

ధోని భారీ సిక్సర్ కొట్టగానే.. 'మీరు దీన్ని పవర్ అనుకుంటున్నారు కదా.. ఇది అద్భుతమైన టైమింగ్.. బ్యాట్ స్పీడ్, స్వింగ్.. ఇలా అన్నీ అద్భుతమైన కలయిక.. ధోని ఆడితే బౌలర్ల పని అంతే' అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇటీవలి కాలంలో పలు విషయాల్లో వార్తల్లో నిలిచి ఉంది. ఐపీఎల్-2020 కోసమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే..! ఆ తర్వాత సురేష్ రైనా అనూహ్యమైన కారణాల వలన జట్టును వదిలి భారత్ కు వచ్చేసాడు. మహేంద్రుడి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యంత విలువైన ఆటగాడు సురేష్ రైనానే..! ఇక హర్భజన్ సింగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు హోమ్ క్వారెంటైన్ లో ఉండగా.. మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. 2019 లో ఫైనల్ లో ఓడిపోయిన చెన్నై ఈ సీజన్ లో టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సెప్టెంబర్ 19న ఐపీఎల్ సీజన్ ఓపెనర్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. 

ఐపీఎల్: హిట్‌మ్యాన్ కొడితే బాక్స్ బద్దలైంది..

పంత్‌ సిక్సర్ల మోత.. వీడియో వైరల్‌

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle