newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో తెలుసు... మీకు చెప్పం : గంగూలీ

03-12-201903-12-2019 09:45:14 IST
2019-12-03T04:15:14.540Z03-12-2019 2019-12-03T04:15:11.090Z - - 06-12-2019

ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో తెలుసు... మీకు చెప్పం : గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని స్థానం ఎంతో ప్రత్యేకం. రెండు ప్రపంచ కప్ లు (2007టీ20, 2011 వన్డే ) అందించి తన పేరును భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నాడు ధోని. కొంత కాలం ఆర్మీలో సేవలు అందించిన జార్ఖండ్ డైనమెట్ అనంతరం ఇంటికే పరిమిత మయ్యాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్ లు ఆడని మహేంద్రుడు ఈ నెల 6న వెస్టిండీస్ తో ప్రారంభమయ్యే సిరీస్ కు దూరంగా ఉన్నాడు. 

అయితే కెప్టెన్ కూల్ రిటైర్మెంట్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అవన్ని ఊహాగానాలే అని తేలిపోయాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి చేసిన ప్రకటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ధోనీ క్రికెట్ భవిష్యత్తుపై తమకు స్పష్టత ఉందని, కొన్ని విషయాలు మూసి ఉన్న డోర్స్‌ లోపలే ఉండాలని.. ధోనీ క్రికెట్ భ‌విత‌వ్యంపై బహిరంగ వేదికలపై వెల్లడించ‌మ‌న్నారు. ధోని జట్టులోకి వస్తాడా రాడా అన్న అంశం ధోనికి, జట్టు మేనేజ్ మెంట్ కు, బోర్డుకు తెలుసన్నారు. ధోని లాంటి దిగ్గజ ఆటగాడి నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉందన్నారు. 

అంతముందు టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కూడా ధోనీ భ‌విష్య‌త్ పై వ్యాఖ్యానించాడు. రాబోవు ఐపీఎల్‌ సీజన్‌ తర్వాతే ధోనీ క్రికెట్‌ భవిష్యత్తు గురించి క్లియర్‌ పిక్చర్‌ తెలుస్తుందని అన్నాడు. ఐపీఎల్ లో ధోని ఎలా రాణిస్తాడో చూసిన తరువాతనే టీ20 వరల్డ్ కప్ లో ధోని పాల్గొనే దానిపై చర్చిస్తామని తెలిపాడు. ధోని అనుభం జట్టుకు చాలా అవసరమన్నాడు. 

ఇక తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎట్టకేలకు పెదవి విప్పాడు. జనవరి తర్వాత తన నిర్ణయం ఉంటుందన్నాడు. జనవరి వరకూ తనను ఏమీ అడగవద్దని.. అప్ప‌టివ‌ర‌కూ నిరీక్షించండి అని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ లో ఆడతానో లేదో అనే విషయం పై ఐపీఎల్ తరువాత ఓ నిర్ణయానికి రానున్నట్లు చెప్పాడు. 

Image result for Dhoni knows when to retire ... Tell you: Ganguly


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle