newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ధోనికి బీసీసీఐ ఝ‌ల‌క్‌.. ధోని కెరీర్ ముగిసిన‌ట్లే..

16-01-202016-01-2020 19:03:00 IST
2020-01-16T13:33:00.211Z16-01-2020 2020-01-16T13:32:57.674Z - - 26-02-2020

ధోనికి బీసీసీఐ ఝ‌ల‌క్‌.. ధోని కెరీర్ ముగిసిన‌ట్లే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ని ఇక అంత‌ర్జాతీయ మ్యాచుల్లో చూడ‌లేమా అంటే అవున‌నే అంటున్నాయి బీసీసీఐ వ‌ర్గాలు. బీసీసీఐ విడుద‌ల చేసిన తాజా కాంట్రాక్టుల జాబితానే అందుకు నిద‌ర్శ‌నం. 2019-20 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. దీంతో కెరీర్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక ధోనిని అంత‌ర్జాతీయ మ్యాచుల్లో చూసే అవ‌కాశం ఉండ‌క పోవ‌చ్చు అని ప‌లువురు మాజీలు అంటున్నారు. 2019 ప్ర‌పంచ‌క‌ప్ లో న్యూజిలాండ్ తో ధోని ఆఖ‌రి సారిగా టీమిండియా జెర్సీలో క‌నిపించాడు.

ఎ+ గ్రేడ్‌లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇక ఎ-గ్రేడ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, చతేశ్వర పుజారా, అజ్యింకా రహానే, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, షమీ, ఇషాంత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌లకు చోటు కల్పించారు. బి-గ్రేడ్‌లో వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్‌, చహల్‌, హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం దక్కగా, సి-గ్రేడ్‌లో కేదార్‌ జాదవ్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, మనీష్‌ పాండే, హనుమ విహారి, శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌ సమయంలో ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్ల వరకూ బీసీసీఐ ఇస్తుండగా, ఎ-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున లభిస్తుంది. గతంలో ఎ+ గ్రేడ్‌ను ధోనికి కేటాయించిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లూ ఆడే క్రికెటర్‌ కోసమే ఎ+ కేటగిరీని తీసుకురాగా, సుదీర్ఘ కాలంగా ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌  మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. కాగా, ఈ నిబంధనను పక్కకు పెట్టిన బీసీసీఐ.. గత సీజన్‌లో ధోనికి ఎ+ గ్రేడ్‌ను కేటాయించింది. అయితే ఇప్పుడు ఎందులోనూ అవకాశం ఇవ్వకుండా ధోనిని తప్పించింది. దాంతో ధోని శకం ఇక ముగిసినట్లేనని బీసీసీఐ చెప్పకనే చెప్పేసింది. 

 

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

   14 hours ago


మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

   17 hours ago


సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

   24-02-2020


క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

   21-02-2020


పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

   20-02-2020


పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

   19-02-2020


కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

   18-02-2020


మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

   18-02-2020


కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

   18-02-2020


సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

   17-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle